https://oktelugu.com/

Vijay Deverakonda- Kriti Sanon: విజయ్ దేవరకొండ పై మనసుపడిన ప్రభాస్ హీరోయిన్.. రౌడీ హీరో కావలంటూ సంచలన కామెంట్స్ !

Vijay Deverakonda- Kriti Sanon: విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ భామలు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. తాజాగా ‘ఆదిపురుష్’ బ్యూటీ కృతి సనన్ కూడా తన స్వయంవరంలో రౌడీ హీరో ఉండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో కృతి సనన్ మాట్లాడుతూ.. తన పెళ్లి స్వయంవరంలో హీరోస్ కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, సౌత్ హీరో విజయ్ దేవరకొండ ఉండాలని కృతి సనన్ ఆశ పడింది. వీరిలో ఎవరైనా తనకు ఓకే […]

Written By:
  • Shiva
  • , Updated On : August 17, 2022 / 11:05 AM IST
    Follow us on

    Vijay Deverakonda- Kriti Sanon: విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్ భామలు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. తాజాగా ‘ఆదిపురుష్’ బ్యూటీ కృతి సనన్ కూడా తన స్వయంవరంలో రౌడీ హీరో ఉండాలంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇచ్చిన ఇంటర్య్వూలో కృతి సనన్ మాట్లాడుతూ.. తన పెళ్లి స్వయంవరంలో హీరోస్ కార్తీక్ ఆర్యన్, ఆదిత్య రాయ్ కపూర్, సౌత్ హీరో విజయ్ దేవరకొండ ఉండాలని కృతి సనన్ ఆశ పడింది. వీరిలో ఎవరైనా తనకు ఓకే అంది. అయితే, విజయ్ దేవరకొండ గురించి ఇంకా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. మరీ ఆ కామెంట్స్ ఏమిటో ఆమె మాటల్లోనే విందాం. ”విజయ్ దేవరకొండ చూడటానికి చాలా అందంగా ఉంటాడు. అన్నిటికీ మించి తను చాలా సెన్సిబుల్. ‏ రీసెంట్ గా తన ఇంటర్వ్యూలు చాలా చూశాను. నాకు తను ఎంతో నిజాయితీగా..సెన్సిటివ్ ‏గా అనిపించాడు. అందుకే.. నా స్వయంవరంలో తను ఉండాలని ఆశ పడుతున్నాను’ అంటూ కృతి పాప చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకపక్క ప్రభాస్ సినిమా ఆది పురుష్ లో నటిస్తూ.. మరోపక్క విజయ్ దేవరకొండ కావాలి అంటూ తన ఫీలింగ్స్ చెప్పింది కృతి సనన్. నిజానికి నాలుగేళ్ల క్రితం అవకాశాలు లేక చిన్నాచితకా యాడ్స్ కూడా చేసి నానా ఇబ్బందులు పడ్డ కృతీ సనన్‌, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. స్టార్ అయ్యాక అమ్ముడు ఇలా బోల్డ్ కామెంట్స్ చేస్తోంది.

    Vijay Deverakonda- Kriti Sanon

    అయినా విజయ్ పై ఒక్క కృతి సననే కాదు, పలు బాలీవుడ్ భామలు కూడా మనసు పడ్డారు. పబ్లిక్ గా విజయ్ దేవరకొండ మాకు క్రష్ అంటూ ఓపెన్ అయ్యారు. పైగా విజయ్ ను ఇష్టపడుతున్న వారందరూ పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్లే. వారిలో ఆలియా భట్, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీఖాన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వీరంతా గతంలో పబ్లిక్ గా విజయ్ దేవరకొండ అంటే తమకు ఇష్టం అంటూ.. అతనితో డేటింగ్ కి రెడీ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎంతైనా విజయ్ దేవరకొండకి ఫిమేల్ ఫాలోయింగ్ ఎక్కువే. విచిత్రం ఏమిటంటే ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ అనే తేడా లేదు. మనోడికి అన్ని చోట్లా లేడీ అభిమానులు ఫుల్లుగా ఉన్నారు.

    Also Read: Vijaya Devarakonda: ఇండస్ట్రీలోకి రావడానికి విజయ్ దేవరకొండ తేజా దగ్గర ఆ పనిచేశాడా?

    Vijay Deverakonda- Kriti Sanon

    చాలా మంది హీరోయిన్లకు అతను డ్రీం హీరో అవ్వడం ఇక్కడ విశేషం. అసలు బాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది ఉన్నా.. అక్కడి స్టార్ హీరోయిన్స్ కి విజయ్ మాత్రమే నచ్చుతున్నాడట. స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కూడా విజయ్ కి ఫిదా అయిపోయింది. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సారా మాట్లాడుతూ.. ‘విజయ్ చాల స్మార్ట్ హీరో. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాల బాగుంటుంది. తనతో నేను డేటింగ్ కి రెడీ అని చెప్పింది. బాలీవుడ్ లో ఇలా చెప్పేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

    Also Read:Karthikeya 2- Bollywood: కార్తికేయ 2కి హిందీ జనం నీరాజనం.. తేలిపోయిన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్.. ఆశ్చర్యపోతున్న బాలీవుడ్ !

    Tags