https://oktelugu.com/

Krithi Shetty: ‘కృతి శెట్టి’ కావాలా ? ఐతే, 3 కోట్లు ఇవ్వండి !

Krithi Shetty: తెలుగు వెండితెర పై తన తళుకులు పరిచి తెలుగు సినీ లోకంలో నీరాజనాలు అందుకుంటున్న యుంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. దర్శకనిర్మాతలు ఈ భామ కోసం పోటీ పడుతున్నారు. కృతి చేతిలో ప్రజెంట్ నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ అన్న తర్వాత బోలెడు డిమాండ్లు ఉంటాయి. పైగా నటన పరంగా ఆ హీరోయిన్ కి క్రేజ్ వస్తే.. ఇంకా ఎక్కువ సతాయింపులు ఉంటాయి నిర్మాతలకు. ముఖ్యంగా హీరోయిన్ల కన్నా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 05:00 PM IST
    Follow us on

    Krithi Shetty: తెలుగు వెండితెర పై తన తళుకులు పరిచి తెలుగు సినీ లోకంలో నీరాజనాలు అందుకుంటున్న యుంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. దర్శకనిర్మాతలు ఈ భామ కోసం పోటీ పడుతున్నారు. కృతి చేతిలో ప్రజెంట్ నాలుగు సినిమాలు ఉన్నాయి. మరి ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ అన్న తర్వాత బోలెడు డిమాండ్లు ఉంటాయి.

    Krithi Shetty

    పైగా నటన పరంగా ఆ హీరోయిన్ కి క్రేజ్ వస్తే.. ఇంకా ఎక్కువ సతాయింపులు ఉంటాయి నిర్మాతలకు. ముఖ్యంగా హీరోయిన్ల కన్నా వాళ్ళ అమ్మలు, నాన్నలే ఎక్కువ ఇబ్బంది పెడుతారు నిర్మాతలని. హీరోయిన్ ‘కృతి శెట్టి’ విషయంలోనూ ప్రస్తుతం ఇదే జరుగుతోంది. ‘ఉప్పెన’ సినిమాలో నటించి ఒక్కసారిగా నాలుగైదు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

    Also Read: Suma: ఆ షోలో సుమ బండారం బయటపెట్టిన రచ్చరవి.. ఏకంగా బూతులు తిడుతూ?

    మరోపక్క కృతి ‘కత్తిలాంటి క్యూటీ’ అంటూ ప్రేక్షులు కూడా కితాబు ఇచ్చారు. దాంతో.. యువ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సరసన ఈ అమ్మడిని తీసుకునేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు. ఒక్కసారిగా, ‘కృతి శెట్టి’ రేంజ్ డబుల్ అయింది. దాంతో, ‘కృతి శెట్టి’ తల్లి ఒక్కసారిగా టోన్, ట్యూన్ మార్చేసింది.

    తన కూతురుకి ఇవ్వాల్సిన పారితోషికం విషయంలో ఆమె ఖరాఖండిగా ఉంటుంది. పైగా ఒక్కో నిర్మాతకు ఒక్కో పారితోషికం చెబుతుంది. సినిమా సినిమాకు 50 లక్షలు పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం సినిమాకు 3 కోట్లు అడుగుతున్నారు. ఆటో మీటర్ కన్నా ‘కృతి శెట్టి’ రెమ్యునరేషన్ స్పీడ్ గా పెరుగుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    Krithi Shetty

    ఇప్పుడు ‘కృతి శెట్టి’ని తమ సినిమాల్లో తీసుకోవాలంటే ముందు ఆమె తల్లిని మెప్పించడం నిర్మాతలకు పెద్ద టాస్క్ అయిపోయింది. పిల్ల ఒకటి చెబితే.. తల్లి రెండు చెబుతుంది. మొత్తమ్మీద ఈ తల్లి కూతురిద్దరూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా ఒంటబట్టించుకున్నారు. డిమాండ్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనక్కి వేసుకుంటూ అవకాశాలను ఒడిసిపట్టుకుంటున్నారు.

    Also Read:RRR Komaram Bheem: RRR లో కొమురం భీమ్ పాత్రని వదులుకున్న హీరోలు వీళ్లేనా??

    Recommended Videos:

    Tags