https://oktelugu.com/

Krithi Shetty-Nani: నానితో బెడ్ రూమ్ సన్నివేశం.. డైరెక్టర్ కి కృతి షాకింగ్ కండీషన్స్!

Krithi Shetty-Nani: అందం అభినయానికి అదృష్టం తోడైతే ఆపడం కష్టమే. ఉప్పెన బేబమ్మ ఈ రకానికి చెందిన అమ్మాయే. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన కృతి శెట్టి కెరీర్ రేసు గుర్రంలా దూసుకెళుతుంది. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏడాది కాలంలోనే అరడజను సినిమాల వరకు సైన్ చేసింది. అరంగేట్రంతోనే సంచలన విజయం దక్కడంతో అమ్మడు పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఇక సెంటిమెంట్స్ ని పిచ్చిగా ఫాలో అయ్యే దర్శక నిర్మాతలు కృతి కాల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 7, 2022 / 11:38 AM IST
    Follow us on

    Krithi Shetty-Nani: అందం అభినయానికి అదృష్టం తోడైతే ఆపడం కష్టమే. ఉప్పెన బేబమ్మ ఈ రకానికి చెందిన అమ్మాయే. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన కృతి శెట్టి కెరీర్ రేసు గుర్రంలా దూసుకెళుతుంది. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఏడాది కాలంలోనే అరడజను సినిమాల వరకు సైన్ చేసింది. అరంగేట్రంతోనే సంచలన విజయం దక్కడంతో అమ్మడు పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఇక సెంటిమెంట్స్ ని పిచ్చిగా ఫాలో అయ్యే దర్శక నిర్మాతలు కృతి కాల్ షీట్స్ కోసం ఆమె వెనుకబడుతున్నారు.

    Krithi Shetty-Nani

    పాతికేళ్ళు కూడా నిండని కృతి ఎంచుకుంటున్న పాత్రలు ఒకింత ఆశర్యం కలిగిస్తున్నాయి. ఆరంభంలోనే ఆమె పాత్రలలో బోల్డ్ సన్నివేశాలు చోటు చేసుకోవడం యాదృచ్చికమనే చెప్పాలి. అయితే కథలో భాగంగా వస్తున్న శృంగార సన్నివేశాలు కావడంతో ప్రేక్షకులు వాటిని అశ్లీలత గా భావించడం లేదు. డెబ్యూ మూవీ ఉప్పెన లో కృతి హీరో వైష్ణవ్ తేజ్ తో శృంగార సన్నివేశంలో నటించారు. కథలో కీలకమైన జలజల జలపాతం నువ్వు… సాంగ్ లో కృతి అన్ లిమిటెడ్ రొమాన్స్ పంచింది. జల జల జలపాతం సాంగ్ … యూట్యూబ్ లో సంచలనం నమోదు చేసింది. 115 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ సాంగ్ టాలీవుడ్ టాప్ 5 సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది.

    కాగా కృతి లేటెస్ట్ హిట్ శ్యామ్ సింగరాయ్ మూవీలో మరింత బోల్డ్ సన్నివేశంలో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ మూవీలో కృతి హీరో నాని తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా కనిపించారు. ఇక ఓ సన్నివేశంలో నాని-కృతి శృంగారం పండించారు. ఈ శృంగార సన్నివేశంలో కృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ సన్నివేశం వెనుక చాలా కథ నడిచిందట.

    Also Read: సెకెండ్ వీక్ లోనూ అదరగొట్టిన ‘శ్యామ్ సింగ రాయ్’ !

    శ్యామ్ సింగరాయ్ లో శృంగార సన్నివేశంలో నటించడానికి కృతి శెట్టి చాలా కండీషన్స్ పెట్టారట. ఆ కండీషన్స్ కి ఒప్పుకుంటేనే సినిమాలో నటిస్తానని ఖరాకండిగా చెప్పారట. ఇక కృతి పెట్టిన షరతుల విషయానికి వస్తే… ఆ సన్నివేశం చిత్రీకరణ సమయంలో హీరో నానితో పాటు దర్శకుడు, కెమెరా మెన్ మాత్రమే గదిలో ఉండాలని చెప్పారట. ఇక ఎక్స్ప్రెషన్స్ కొంచెం అటూ ఇటూ ఉన్నా.. ఎక్కువ టేక్స్ తీసుకోకుండా ఓకే చేయాలని అన్నారట. కృతి కండీషన్స్ కి డైరెక్టర్ రాహుల్ అంగీకరించడంతో ఆమె నటించారట.

    ఇక ఆ బెడ్ రూమ్ సన్నివేశంతో శ్యామ్ సింగరాయ్ మూవీ మలుపు తిరుగుతుంది. కృతి ఆ సన్నివేశంలో నటించాడని, ఇది కూడా ఒక కారణమట. కండీషన్స్ మధ్య చిత్రీకరించినా కృతి చాలా సహజంగా నటించి సన్నివేశం పండించారు. మరోవైపు ఆమె హీరోయిన్ గా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతున్న విషయం తెలిసిందే. అలాగే సుధీర్ బాబు తో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.

    Also Read: శ్యాం సింగరాయ్ మూవీ విలన్.. ఇతన్ని తప్ప వేరే వారిని ఊహించుకోలేము

    Tags