Krithi Shetty: ముద్దు కావాలా నాయనా.. అయితే పెట్టుకోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది ‘కృతి శెట్టి’. పైగా తన ఫోటో కూడా షేర్ చేసింది. పాలమీగడ మీద చిక్కని నురుగు లాంటి మేని ఛాయతో అమ్మడు ఈ ఫొటోలో ముసిముసి నవ్వులు కూడా చిందించింది. కృత కిస్ మీ అంటూ ఇచ్చిన ఈ ఫోజు నెటిజన్లను ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇప్పటికే, తెలుగు వెండితెర పై తన తళుకులు పరిచి తెలుగు సినీ లోకంలో నీరాజనాలు అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ యుంగ్ బ్యూటీ.

మరోపక్క దర్శకులు ‘కృతి శెట్టి’ కోసం పోటీ పడుతున్నారు. దీనికితోడు కృతి ‘కత్తిలాంటి క్యూటీ’ అంటూ ప్రేక్షులు కూడా కితాబు ఇచ్చారు. దాంతో.. యువ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోల సరసన ఈ అమ్మడిని తీసుకునేందుకు నిర్మాతలు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా క్యూ కట్టారు. ఒక్కసారిగా, ‘కృతి శెట్టి’ రేంజ్ డబుల్ అయింది.
Also Read: Rajamouli Mahesh Babu: మహేష్ బాబు విషయంలో రాజమౌళి తప్పు చేస్తున్నాడా?
నిజానికి ‘నీ కన్ను నీలి సముద్రం… అనే ఒక లిరికల్ వీడియో సాంగ్ తోనే ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించింది ఈ సెన్సేషన్ బ్యూటీ. పైగా మొదటి సినిమా ఉప్పెన సూపర్ హిట్ అయ్యింది. నాని, చైతుతో చేసిన సినిమాలు కూడా బాగానే ఆడాయి. దాంతో అమ్ముడికి తిరుగులేకుండా పోయింది. అన్నిటికీ మించి కెరీర్ మొదట్లో పెద్దగా డిమాండ్లు చేయలేదు.

మీరు ఇచ్చినంతే పుచ్చుకుంటా, ముందు మీ చిత్రంలో ఒక అవకాశం ఇవ్వండని స్టార్ డైరెక్టర్లను నిర్మాతలను కృతి శెట్టి రిక్వెస్ట్ చేసింది. ఐతే, రెండు హిట్లు పడ్డాక మాత్రం.. సినిమా సినిమాకు 50 లక్షలు పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం సినిమాకు 3 కోట్లు అడుగుతుంది.
మొత్తానికి పెట్రోల్ రేటు కన్నా ‘కృతి శెట్టి’ రెమ్యునరేషన్ స్పీడ్ గా పెరుగుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను ఈ కృతీ కుట్టీ బాగా ఒంటబట్టించుకుంది.
Also Read:Chor Baazar 3 Days Collections: ‘చోర్ బజార్’ 3 డేస్ కలెక్షన్స్.. ఇంకా ఎంత రావాలంటే ?
[…] […]