https://oktelugu.com/

Krithi Shetty: లావణ్య త్రిపాఠి బాటలో కృతి శెట్టి… మెగా హీరోతో పెళ్ళికి సిద్ధం?

గతం లోనే తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, ప్రస్తుతానికి సినిమా లే తన ప్రాధాన్యత అంటూ కృతి శెట్టి తేల్చి చెప్పింది. నిజానికి ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి.

Written By:
  • Shiva
  • , Updated On : September 15, 2023 / 11:14 AM IST

    Krithi Shetty

    Follow us on

    Krithi Shetty: సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ మీద రూమర్స్ రావడం సహజమే. పెళ్లి కానీ హీరో హీరోయిన్స్ ఎక్కడైనా సన్నిహితంగా కనిపిస్తే చాలు వాళ్ళ మధ్య ఏదో వ్యవహారం నడుస్తున్నట్లే అన్నట్లు మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. కొన్ని సార్లు అది నిజమే అవుతుంది. టాలీవుడ్ విషయానికి వస్తే నాగ చైతన్య – సమంత , వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వాళ్ళ విషయంలో మీడియా ముందే పసికట్టింది.

    ఇప్పుడు ఇదే వరసలో మరో టాలీవుడ్ జంట గురించి అడపాదడపా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఉప్పెన సినిమా తో మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్న బేబమ్మ కృతి శెట్టి మెగా హీరోతో రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో రొమాన్స్ చేస్తుందని, గత కొన్నేళ్ల నుంచి వాళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తుందని, లావణ్య – వరుణ్ మాదిరి వాళ్ళు కూడా తమ ప్రేమను దాచి పెడుతున్నట్లు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి.

    ఉప్పెన సినిమా తోనే వెలుగులోకి వచ్చిన వైష్ణవ్ తేజ్ ఈ సినిమా సమయంలోనే కృతి శెట్టి తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక రకంగా ఇద్దరికీ అదే మొదటి సినిమా కావడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని , దీనితో ప్రేమికులుగా మారిపోయారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇలాంటివి వినిపించిన వెంటనే వాటికి చెక్ పెట్టే విధంగా కృతి శెట్టి టీం పనిచేస్తున్నది. ఇలాంటివి అన్ని కేవలం రూమర్స్ మాత్రమే అంటూ స్టేట్మెంట్స్ వస్తున్నాయి.

    గతం లోనే తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, ప్రస్తుతానికి సినిమా లే తన ప్రాధాన్యత అంటూ కృతి శెట్టి తేల్చి చెప్పింది. నిజానికి ఉప్పెన సినిమా తర్వాత ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. కానీ అవేమి కృతి కెరీర్ కి బూస్ట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఉప్పెన సినిమా తో ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఏర్పాటు అయ్యింది. ఇప్పటికి కూడా ఆమెకు సరైన హిట్ అనేది పడితే టాప్ లీగ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది.