Krithi Shetty: ‘ఉప్పెన’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తో మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైన క్యూట్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty). ఈ సినిమా తర్వాత కచ్చితంగా ఈమె పెద్ద రేంజ్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సైతం ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి పెద్ద రేంజ్ కి వెళ్తుందని చెప్పుకొచ్చాడు. అందరూ ఊహించిన విధంగానే కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్స్ వరుసగా క్యూలు కట్టాయి. ‘ఉప్పెన’ తర్వాత ఆమె నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో ఎంత వేగంగా అయితే ఆమె కెరీర్ లో ఎదిగిందో, అంతే వేగంగా క్రిందకు పడిపోయింది. ఇక కృతి శెట్టి పని ఐపోయినట్టే అని అంతా అనుకున్నారు.
Also Read: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ మొదటి రోజు వసూళ్లు..ప్రదీప్ కి ఎదురుదెబ్బ!
కానీ ఇప్పుడు ఆమె తమిళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కార్తీ(Karthi Sivakumar) నటిస్తున్న ‘వా..వాతియార్'(Va..Vathiyaar) చిత్రం కాగా, మరొకటి ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటిస్తున్న LIC(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే చిత్రం. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రదీప్ రంగనాథన్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. పైగా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘ధీమా’ సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నయనతార భర్త సతీష్ విగ్నేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, నయనతార నిర్మాతగా వ్యవహరిస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది.
ప్రదీప్ రంగనాథన్ సినిమా కాబట్టి కచ్చితంగా బాగుంటుంది అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఏర్పడడం వల్ల ఈ చిత్రాన్ని యావరేజ్ రేంజ్ లో తీసినా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అని అనుకోవచ్చు. ఈ సినిమా డ్రాగన్ రేంజ్ లో హిట్ అయితే కృతి శెట్టి తలరాత మారిపోతుంది. ఇక ఆమె హీరోయిన్ గా నటించబోతున్న మూడవ చిత్రం సూర్య తో ఉండబోతుందని తెలుస్తుంది. సూర్య త్వరలో తెలుగు లో ఒక సినిమా చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే తెలుగులో ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఆమె చివరి సారిగా మన ఆడియన్స్ కి కనిపించిన చిత్రం ‘మనమే’. గత ఏడాది విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది.