Krishnam Raju Birthday: తెలుగు సినిమా రెబల్ స్టార్, కథానాయకుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు పుట్టినరోజు నేడు. 1940లో జనవరి 20న ఆయన జన్మించారు. 1970, 1980లలో స్టార్ హీరోగా ఆయన తన హవాని కొనసాగించారు. మొత్తం 183 తెలుగు సినిమాలలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి.. 12వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలిచి రాజకీయ నాయకుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత 13వ లోక్ సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం కూడా సాధించారు. అయితే, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి కృష్ణంరాజు ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన మళ్ళీ రాజకీయంగా ఉన్నత స్థానికి ఎదగలేకపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు కుటుంబ స్వగ్రామం.
పైగా విజయనగర సామ్రాజ్య వారసులు కృష్ణంరాజు. కృష్ణంరాజుకు జీవిత భాగస్వామి శ్యామలా దేవి. 1996లో నవంబర్ 21న వీరి వివాహం జరిగింది. వీరికి ప్రసిద్ధి, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నేడు ఆయన పుట్టినరోజు.. కృష్ణంరాజుకు మా ఓకే తెలుగు నుండి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.
Also Read: విషాదం: ప్రముఖ తెలుగు నటుడు మృతి !
కృష్ణంరాజు జీవిత కాలంలో అందుకున్న అవార్డులు రివార్డులు ఇవే !
• రాష్ట్రపతి అవార్డులు
1977 అమర దీపం చిత్రానికి ఉత్తమ నటన
1978 మన వూరి పాండవులు చిత్రానికి ఉత్తమ నటన
• ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్
ఉత్తమ నటుడు – తెలుగు – అమరదీపం (1977)
• ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (2006)
2014 – రఘుపతి వెంకయ్య అవార్డు
Also Read: ‘గని’ టీజర్ లో వరుణ్ తేజ్ పంచ్ అదిరింది !