Shah Rukh Khan Krishna Vamsi: ‘గులాబీ’ సినిమాతో సక్సెస్ ను సాధించిన కృష్ణవంశీ…ఆయన గురువు రామ్ గోపాల్ వర్మ కి తగ్గ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చేసిన నిన్నే పెళ్ళాడుతా, మురారి, ఖడ్గం లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్నాడు… అలాంటి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో సైతం సినిమా చేయడానికి రెండు మూడు కథలను రెడీ చేసుకున్నాడు. అయినప్పటికి అవి కార్య రూపం దాల్చలేదు… తన ఎంటైర్ కెరియర్ లో ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికి ఆయనకు దర్శకుడికి రావాల్సినంత గుర్తింపైతే రాలేదనేది వాస్తవం…ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ కి తనకి మధ్య కొన్ని విభేదాలైతే వచ్చాయి. కారణం ఏంటి అంటే కృష్ణవంశీ నాగార్జునతో చేసిన ‘చంద్రలేఖ’ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం మొదట షారుక్ ఖాన్ ను అడిగారట. షారుఖ్ మొదట చేస్తానని ఓకే చెప్పినప్పటికి ఆ తర్వాత తనకు చేయడానికి వీలు లేదని చెప్పి ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశాడు.
దాంతో సంజయ్ దత్ తో ఆ క్యారెక్టర్ చేయించాడు. మొత్తానికైతే ఆ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఇక అప్పటి నుంచి కృష్ణవంశీ కి షారుక్ ఖాన్ అంటే కొంతవరకు కోపమైతే ఉంది. ఇక ఆ తర్వాత కాలంలో కృష్ణవంశీ చేసిన ఖడ్గం సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో షారుక్ ఖాన్ ఆ సినిమా రీమేక్ రైట్స్ ని తనకి ఇవ్వాలని కృష్ణవంశీ ని కోరారట.
దాంతో చంద్రలేఖ సినిమా సమయంలో షారుక్ ఖాన్ చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఆ సినిమా రైట్స్ ని వేరే వాళ్ళకి అమ్మేశాడు. మొత్తానికైతే ఇప్పటివరకు కృష్ణవంశీ షారుక్ ఖాన్ కి మధ్య మాటలైతే లేవు… ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ హవా చాలా వరకు తగ్గింది.
‘రంగమార్తాండ’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి ఆ తర్వాత తనతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ప్రస్తుతం ఆయన కథలను రాసుకునే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…