Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది దర్శకులు ఒక సీన్ అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి చాలావరకు ప్రయత్నాలైతే చేస్తుంటారు. అందులో కొన్నిసార్లు నటులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి గాయాలు అవుతుంటాయి. అయిన కూడా వాళ్ళు అనుకున్నది వచ్చేంత వరకు ఆ నటులను వదిలిపెట్టరు. ఇక అలాంటి కోవకు చెందినవాడే కృష్ణవంశీ… క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. మురారి సినిమాను చేసిన ఆయన ఆ సినిమాను ఒక క్లాసికల్ హిట్ గా మార్చడంలో తను కీలకపాత్ర వహించాడు. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మహేష్ బాబు ఎలాంటి డూప్ లేకుండా చేశారట. ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు కి కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గాయాలు కూడా అయ్యాయని అతను ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు… ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సి.రాంప్రసాద్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మురారి సినిమా సమయంలో మహేష్ బాబుకు తప్పిన ఒక పెను ప్రమాదం గురించి చాలా క్లారిటీగా తెలియజేశాడు.
మహేష్ బాబు ఒక కొబ్బరి చెట్టు దగ్గర కూర్చుని ఉంటే పై నుంచి కొబ్బరికాయలు అతని మీద పడబోతుంటాయి. మహేష్ లేచి ముందుకు వెళుతూ ఉంటాడు. నిజానికి ఆ సినిమాలో అనుకోకుండా కింద పడే కొబ్బరి బోండాలు కావడం అది హీరోకి తెలియకుండా జరిగేది కాబట్టి ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటి రేకెత్తించింది.
కానీ కృష్ణవంశీ మాత్రం రాయల్స్టిక్ గా ఉండటానికి నిజమైన కొబ్బరి బొండాలను పైనుంచి వేయాలంటూ పట్టుబట్టడంతో కొబ్బరికాయలు పడడం, మహేష్ బాబు అక్కడినుంచి లేచి ముందుకెళ్లడం అవి అతను కూర్చున్న ప్లేస్ లోనే పడడం అన్నీ ఒకేసారి జరగాలి. ఇందులో ఏ చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగినా కూడా కొబ్బరి బోండాలు డైరెక్ట్ గా మహేష్ బాబు తల మీద పడి తీవ్రమైన ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి…
అయినప్పటికి కృష్ణవంశీ సీన్ రియాలెస్టిక్ గా రావడానికి ఈ సీన్ ను చాలా ఈజీగా చేసేసాడు అంటూ రాంప్రసాద్ తెలియజేశాడు. మొత్తానికైతే కృష్ణవంశీ మహేష్ బాబు ప్రాణాలతో చెలగాటం ఆడడంటూ కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇంకొంతమంది మాత్రం అలా చేస్తేనే సీన్ రియలెస్టిక్ గా వచ్చింది. దానివల్లే సినిమా అంత పెద్ద సక్సెస్ ని సాధించింది అంటూ కృష్ణవంశీకి సపోర్ట్ చేస్తున్నారు…