https://oktelugu.com/

Bigg Boss 8 Telugu లోకి రష్మికతో బెడ్ షేర్ చేసుకున్న బెస్ట్ ఫ్రెండ్.. రాత్రిళ్లు ఆ పనిచేసేవారట..!

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న బిగ్ బాస్ షో ద్వారా వాళ్ళు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 1, 2024 11:25 pm
    Krishna Mukunda Murari's serial fame Prerana

    Krishna Mukunda Murari's serial fame Prerana

    Follow us on

    Bigg Boss 8 Telugu  ప్రస్తుతం బిగ్ బాస్ షో సీజన్ 8 స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరి చూపు ఈ షో పైనే ఉంది. కంటెస్టెంట్స్ ఎవరికి వారు టైటిల్ గెలవాలనే ఉత్సాహంతో ఈ షోలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నప్పటికీ అభిమానులు సైతం ఈ షో మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సీజన్ లో ఎవరు ఆ టైటిల్ని గెలుచుకొని వాళ్ళ స్టార్ డమ్ ని పెంచుకుంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ షోలోకి కొంత మంది సీరియల్ ఆర్టిస్టులు, మరి కొంతమంది యూట్యూబ్ సెలబ్రిటీలు, ఇంకొంతమంది సినిమా నటులను కలిపి ఈ షో కోసం తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రేరణ..ప్రస్తుతం ‘కృష్ణ ముకుంద మురారి’ సిరియల్ లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకుంటుంది. నిజానికి ప్రేరణ చూడడానికి చాలా అందంగా ఉండటమే కాకుండా నటనతో కూడా ప్రేక్షకుల్ని చాలా వరకు మెప్పిస్తూ ఉంటుంది. అందువల్లే ఆమెకు సీరియల్ లో చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక టీవీ సీరియల్ చూసేవాళ్ళు ఆమె అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు.

    అందువల్లే ఆమె ఎలాగైనా సరే టైటిల్ ని గెలిచి తన అభిమానులను ఆనంద పరచాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ఆమె పెద్దగా సినిమాల్లో నటించిన దాఖలాలు అయితే లేవు. కాబట్టి ఎలాగైనా సరే ఈ టైటిల్ ని గెలుచుకొని సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె ప్రయత్నం అయితే చేస్తుంది.

    నిజానికి ప్రేరణకి స్టార్ హీరోయిన్ అయిన ‘రష్మిక మందాన’ మంచి ఫ్రెండ్ అనే విషయం చాలామందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో వీళ్ళు ఒకే హాస్టల్లో ఉండి ఒకే కంచం లో తిని ఒకే మంచం లో పడుకునేవారట. ఈ ఇద్దరూ అవకాశాల కోసం చాలావరకు ఆడిషన్స్ కి కూడా అటెండ్ అయ్యేవారట. ముఖ్యంగా రాత్రివేళల్లో కూడా సినిమా షూటింగ్స్ కోసం తిరిగేవారట… అలా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది.ఇప్పటికీ అదే బాండింగ్ తో ఉంటున్న వీళ్ళిద్దరూ అవకాశం దొరికిన ప్రతిసారి కలుసుకుంటారట…

    ఇక ప్రేరణ బిగ్ బాస్ కి వచ్చిన విషయం తెలిస్తే రష్మిక కూడా చాలావరకు సంతోషపడి ఆమెను ఎంకరేజ్ చేస్తూ తను కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టే అవకాశాలైతే ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…