https://oktelugu.com/

Krishna – Mahesh Babu : కృష్ణకి తన మిగతా పిల్లల కంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టం ఉండేదట… కారణం ఏంటంటే..?

కృష్ణ కి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం... ఇక కృష్ణ గారంటే కూడా మహేష్ కి కూడా అమితమైన ఇష్టం ఉంటుంది...కృష్ణ ఆయనకి పుట్టిన మిగతా పిల్లల మీద కూడా ఇష్టం ఉన్నప్పటికీ, వాళ్ళ అందరితో పోలిస్తే కృష్ణ గారికి మహేష్ బాబు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 08:22 AM IST

    Krishna loved Mahesh Babu more than his other children...

    Follow us on

    Krishna – Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు అమోఘం అనే చెప్పాలి. కృష్ణ పోషించిన చాలా పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో ఒక ఎపిక్ గా నిలిచిపోయింది. ఇక అల్లూరి సీతారామరాజు పేరు చెప్పిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులందరికీ కృష్ణ గారు మాత్రమే గుర్తుకొస్తారు. అలాంటి ఒక పర్ఫామెన్స్ తో ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకున్న ఒకే ఒక్క నటుడు కృష్ణ… ఇక ఇది ఇలా ఉంటే కృష్ణ చాలామంది హీరోలను, దర్శకులను ఎంకరేజ్ చేస్తూ తనతోపాటు వాళ్ళని కూడా ఇండస్ట్రీ లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.

    అందుకే ఆయనని ఇండస్ట్రీలో చాలామంది గౌరవిస్తూ, అతనికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండేవారు. ఇక కృష్ణ పర్సనల్ లైఫ్ లోకి వస్తే ఆయనకి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్న విషయం మనకు తెలిసిందే… ఇక అందరికంటే చిన్నవాడైనా మహేష్ బాబు అంటే కృష్ణకి చాలా ఇష్టమట.ఎందుకంటే సినిమా షూటింగ్ ల్లో ఎప్పుడు హడావిడిగా గడిపిన కృష్ణ తన పిల్లలతో ఎప్పుడు ఎక్కువసేపు గడపలేదట. ఇక మహేష్ బాబు పుట్టిన తర్వాత నుంచి సినిమాలు చేస్తూనే పిల్లలతో గడపడానికి కృష్ణ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారట.

    కానీ మిగతా పిల్లలందరూ స్కూల్ లకి వెళ్లడం వల్ల ఇంట్లో మహేష్ బాబు ఒక్కడే ఉండేవాడట. దానివల్ల కృష్ణ అతనితో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వల్ల తనంటే తెలియకుండానే కృష్ణ కి మిగతా పిల్లల కంటే ఎక్కువ ఇష్టం ఏర్పడిందట. దానివల్లే మహేష్ బాబుని వీలు దొరికినపుడల్లా తనతో పాటు షూటింగ్ లకి తీసుకొస్తూ సినిమా వాతావరణాన్ని అలవాటు చేసేవారట. ఇక మొత్తానికైతే తన తర్వాత హీరోగా ఎదిగే సత్తా మహేష్ బాబు కి మాత్రమే ఉందని గమనించిన కృష్ణ మహేష్ బాబు కి సినిమాల పట్ల ఇంట్రెస్ట్ పెరిగే విధంగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు.

    ఇక అందువల్లే కృష్ణ కి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం… ఇక కృష్ణ గారంటే కూడా మహేష్ కి కూడా అమితమైన ఇష్టం ఉంటుంది…కృష్ణ ఆయనకి పుట్టిన మిగతా పిల్లల మీద కూడా ఇష్టం ఉన్నప్పటికీ, వాళ్ళ అందరితో పోలిస్తే కృష్ణ గారికి మహేష్ బాబు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. దానికి కారణం మహేష్ ఎంతైనా చిన్న కొడుకు కాబట్టి అలా ప్రేమ ఉండటం సహజం అని ఆయన సన్నిహితులు చెప్తారు…