HBD Krish Jagarlamudi: టాలీవుడ్ లో ‘యంగ్ క్రియేటివ్ డైరెక్టర్’గా పేరు తెచ్చుకున్నాడు. పాత కథలను కొత్తగా చెప్పడంలో టాలెంటెడ్ అనిపించుకున్నాడు. ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించడానికి నిత్యం కసరత్తులు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఆ దార్శనిక దర్శకుడే క్రిష్. కెరీర్ లో కమర్షియల్ గా చూసుకుంటే సక్సెస్ రేట్ తక్కువే. కానీ ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కంటే.. క్రిష్ కే ఎక్కువ డిమాండ్ ఉంది. నేడు క్రిష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా క్రిష్ గురించి ఓ ప్రత్యేక కథనం.

తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించడంలో ఆ అంశాలనే కథలుగా మార్చడంలో క్రిష్ మేటి. పైగా క్రిష్ కి షాట్ మేకింగ్ లో ప్రత్యేక టాలెంట్ ఉంది. దీనికితోడు తన సినిమాలతోనే సమకాలీన సమస్యలకు తగిన పరిష్కారం చూపించడంలో క్రిష్ గ్రేటే. క్రిష్ గుంటూరులో పుట్టి పెరిగాడు. ఆయన తాతగారు జాగర్లమూడి రమణయ్య పోలీసు అధికారి.

జాగర్లమూడి రమణయ్య గారి ప్రభావం క్రిష్ పై ఎక్కువ. ఆయన వల్లే క్రిష్ కి చిన్నతనం నుంచే కథలు, చదవడం, రాయడం పై ఆసక్తి వచ్చింది. దీనికి తోడు క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబాకు సినిమాలంటే పిచ్చి. ఆ పిచ్చితోనే సాయిబాబా కొన్నాళ్ళ పాటు ఓ సినిమా థియేటర్ కూడా నడిపాడు. దాని కారణంగానే క్రిష్ కి చిన్న తనంలో సినిమాల పై ఇంట్రెస్ట్ కలిగింది.
యూఎస్ వెళ్ళినా సినిమా పిచ్చి పోలేదు. దాంతో అమెరికాలో ఉన్నప్పుడే ఒక కథ రాసుకుని దాన్ని సినిమాగా తీద్దామనుకుని కొన్ని ప్రయత్నాలు చేశాడు. కాకపోతే అమెరికాలో సినిమా చేయడం కుదరలేదు. ఇక ఇండియాకి వచ్చి ‘ఒకరికొకరు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రసూల్ ఎల్లోర్ దగ్గర సహాయ దర్శకుడిగా జాయిన్ అయ్యాడు.
ఆ తర్వాత గమ్యంతో డైరెక్టర్ అయ్యాడు. అప్పటి నుంచి హిట్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే.. 2016 ఆగష్టు 7న హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్ లో డాక్టర్ రమ్య వెలగతో క్రిష్ జాగర్లమూడికి వివాహం జరిగింది. అయితే, వాళ్ళు త్వరగానే విడిపోయారు. క్రిష్ ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు. నేడు క్రిష్ పుట్టినరోజు.. ఆయనకు ఓకే తెలుగు నుండి ప్రత్యేక శుభాకాంక్షలు.