రీల్ లైఫ్లో సక్సెస్ సాధించిన కొందరు స్టార్లు రియల్ లైఫ్ లో మాత్రం తడబడుతుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో తాము తీసుకున్న నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. కొందరు సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని ఆ తరువాత విడిపోయి.. ఎవరికి వారు విడిగా జీవిస్తున్నారు. ఇంకొందరు విడిపోయిన వారు ఇతరులను పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తున్నారు. సినీ ఫీల్డులో చాలా వరకు పెళ్లిళ్లు పెటాకులుగానే మారుతాయి. కానీ ఈ తంతు లెటెస్టు జంటల విషయంలోనూ జరగడం విశేషం. రీసెంట్ గా నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇండస్ట్రీలో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారు..? ఎవరు విడిపోయారు..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

నాగార్జున -లక్ష్మీ దగ్గుబాటి: టాలీవుడ్లో అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీకి మంచి సాన్నిహిత్యం ఉండేది. ఈ సాన్నిహిత్యం సంబంధాలు కలుపుకునేవరకు వెళింది. దీంతో అక్కినేని నాగేశ్వర్ రావు కుమారుడు నాగార్జున, నిర్మాత రామానాయుడు కుమార్తె లక్ష్మికి వివాహం చేశారు. అయితే కొన్నాళ్లు కలిసున్న వీరు ఆ తరువాత విడాకులు తీసుకున్నారు. ఇద్దరు ఇతర వ్యక్తులను పెళ్లిళ్లు చేసుకొన్నారు.
రాధిక-ప్రతాప పోతన్: సౌత్ స్టార్ నటి రాధిక, తమిళ నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్లి చేసుకుంది. వీరు కొంతకాలం కలిసున్న తరువాత మనస్పర్థలు వచ్చాయి. దీంతో రాధిక వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. అతనితోనూ కలిసుండలేక విడాకులు తీసుకుంది. ప్రస్తుతం శరత్ కుమార్ తో కలిసుంటుంది. ప్రతాప్ పోతన్ మాత్రం ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.
కమలాసన్-సారిక: విలక్షన నటుడు కమలాసన్, సారికలు ఇద్దరూ నటులే. కొన్ని సినిమాల్లో వీరు కలిసి నటించారు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తరువాత విడిపోయారు. వీరికి పుట్టిన శృతి హాసన్, అక్షర హాసన్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
శరత్ బాబు-రమాప్రభ: లేడి కమెడియన్ గా గుర్తింపు పొందిన రమాప్రభ, శరత్ బాబు పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి మధ్య పడలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత శరత్ బాబు వేరే పెళ్లి చేసుకున్నారు. రమాప్రభ ఒంటరిగానే ఉన్నట్లు సమాచారం.
పవన్ కల్యాణ్-రేణుదేశాయ్:టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్-రేణుదేశాయ్ లు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులుసహజీవనం సాగించారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో విడాకులు తీసుకున్నారు.
సుమంత్-కీర్తిరెడ్డి: అక్కినేని ఫ్యామిలికి చెందిన సుమంత్ మరో నటి కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత విడిపోయారు. అయితే కీర్తిరెడ్డి వేరే ఒకతనని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లింది. సుమంత్ రీసెంట్ గా మరో పెళ్లి చేసుకునేందుకురెడీ అవుతున్నట్లుసమాచారం.
ప్రకాశ్ రాజ్-లలితాకుమారి: కొన్ని కారణాల వల్ల వీరు పెళ్లి చేసుకొని విడిపోయారు. ప్రకాశ్ రాజ్ ఓ డ్యాన్సర్ ను పెళ్లి చేసుకున్నాడు.