Kota Srinivasa Rao Death: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో కోట శ్రీనివాసరావు (Kota Sinivasa Rao) ఒకరు.ఆయన తన కెరియర్ లో చేసిన చాలా సినిమాల్లో గొప్ప నటుడిగా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా చాప అవార్డ్ లను కూడా అందుకున్నాడు. మరి అలాంటి కోట శ్రీనివాసరావు ఈరోజు అనారోగ్య కారణంగా మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.
మరి ఏది ఏమైనా కూడా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఆయన విలన్ గా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించడమే కాకుండా ఆయా పాత్రలకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా జంధ్యాల(Jandhyala) డైరెక్షన్లో వచ్చిన అహనా పెళ్ళంట (Ahana Naa Pellanta) సినిమాలో పిసినారిగా తన నటన అద్భుతం అనే చెప్పాలి. ఆ సినిమాతో తారా స్థాయికి వెళ్లిపోయిన ఆయన నటుడిగా అందరి చేత ప్రశంసలను అందుకున్నాడు. ఈ ఒక్క పాత్రతో ఆయన నటన పరిణితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇక ఈ సినిమాతో పాటు ఆయన వెంకటేష్ హీరోగా తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన గణేష్ (Ganesh) సినిమాలో డిఫరెంట్ విలన్ గా కనిపించి మెప్పించాడు. విలనిజం అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో చేసి చూపించాడు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలకి ఆయన పోషించిన పాత్ర ఇన్స్పిరేషన్ గా నిలిచింది అంటే ఆయన ఎలాంటి పాత్రను పోషించాడో మనం అర్థం చేసుకోవచ్చు.
Also Read: Anasuya Online Scam: వారి చేతిలో మోసపోయిన అనసూయ… సంచలనంగా సోషల్ మీడియా పోస్ట్
ఆయన చేసిన చాలా పాత్రాలను చూస్తే చాలు ఆయన ఎంత గొప్ప నటుడో మనకు అర్థమైపోతుంది. ఆయన కెరియర్ లో ఎన్నో మంచి పాత్రలను పోషించినప్పటికి ఈ రెండింటిలో మాత్రం ఆయన జీవించేసాడనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన చాలామంది ఆర్టిస్టులు వాటిని ఇమిటేట్ చేస్తు నటించారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
స్టార్ హీరోలతో కలిసి నటించడమే కాకుండా వాళ్లకు పోటీని ఇస్తూ విలనిజాన్ని కూడా పండించిన ఘనత అతనికే దక్కుతోంది. రావుగోపాలరావు తర్వాత అంతటి గొప్ప విలనిజాన్ని ప్రదర్శించిన నటుడు కూడా తనే కావడం విశేషం…
RIP sir #KotaSrinivasaRao #RIPKotaSrinivasaRao pic.twitter.com/35qJ8XqeDS pic.twitter.com/OMgPpSvHOO
— Babu Gaadu (@Babugadu009) July 13, 2025
ఇక గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య బారిన పడి ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా ఆయన సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నిజజీవితంలో కూడా చాలా నిజాయితీగా ఉంటూ వచ్చాడు. మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక లెజెండరీ నటుడిని కోల్పోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…