Korean Best Movies: మన ఇండియన్ సినిమాలో క్రైమ్ లేదా డ్రామా సినిమాలు అంటే మలయాళీ మూవీస్ కి ఓటేస్తాం. కొన్నిసార్లు తెలుగు, ఇంకొన్నిసార్లు హిందీ సినిమాలు డామినేట్ చేసినప్పటికీ.. అంతకుమించి తోపు సినిమాలంటే హాలీవుడ్ అనే అంటాం. కానీ హాలీవుడ్ ను మించిన సినిమాలు దక్షిణ కొరియాలో నిర్మితమవుతాయి. డ్రామా, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా అన్ని జోనర్లలో అక్కడ సినిమాలు నిర్మితమవుతుంటాయి. ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాతే వాటి గురించి మనకు తెలిసింది. ఇంతకీ కొరియన్ లో టాప్ డ్రామా సినిమాలు, మీరు కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఏంటంటే..
Reply 1988
దక్షిణ కొరియా రాజధాని సీయోల్ ప్రాంతంలో ఒకే పరిసరాల్లో ఉండే ఐదు కుటుంబాల నేపథ్యంగా ఈ సినిమా రూపొందించారు. ప్రారంభ సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమా చూపు తిప్పుకొనివ్వదు. ఫ్యామిలీ డ్రామా అయినప్పటికీ థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తీసిపోదు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఈ సినిమాకు హైలెట్. ఇందులో పాత్రలు మన నిజజీవితంలో చూసినట్టే ఉంటాయి.
My unfamiliar family
ఒక కుటుంబానికి చెందిన చిన్న కుమారుడు ఓ యువతిని ప్రేమిస్తాడు. ఆమె ప్రేమకు ఒప్పుకున్నప్పటికీ.. ఇద్దరం ఒక్కటి కావాలంటే కచ్చితంగా ఈ కుటుంబ సభ్యుల అనుమతి కావాలని డిమాండ్ పెడుతుంది. దానికి ముందుగా ఆ యువకుడి కుటుంబంలోకి వెళుతుంది. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని కొన్ని సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి.
Once again
ఒక ఉమ్మడి కుటుంబం వివిధ అవసరాల రీత్యా వేరుపడుతుంది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వారు స్థిరపడతారు. చివరికి వారు కలుసుకుంటారు. వారు కలుసుకునే క్రమంలో జరిగే కథే ఈ సినిమా. చూడ్డానికి చాలా బాగుంటుంది. ప్రతి సన్నివేశం ఏదో ఒక సమయంలో మనకు కనెక్ట్ అవుతుంది.
Father is strange
ఒక ఐదుగురు పిల్లల తండ్రి ఆకస్మాత్తుగా అదృశ్యమవుతాడు. అతని జాడ కోసం ఆ పిల్లలు తెగ ప్రయత్నిస్తారు. చివరికి ఆ పిల్లల్ని ఆ తండ్రి కలుస్తాడు. ఈ కలిసే క్రమంలో జరిగే సన్నివేశాలు కంట నీరు తెప్పిస్తాయి. అయితే ఆ తండ్రి ఆకస్మాత్తుగా ఎందుకు అదృశమయ్యాడో దర్శకుడు చివర్లో రివిల్ చేస్తాడు. ఆ సన్నివేశం తర్వాత అతని ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం.
Brilliant heritage
తండ్రి మరణం తర్వాత సోదరి, సోదరుడి మధ్య వివాదాలు ఏర్పడి ఎవరికి వారుగా విడిపోతారు. చివరికి ఒకరి గొప్పతనం ఒకరు తెలిసి కలుసుకుంటారు. ఈ కలుసుకునే క్రమంలో అతడి తండ్రి వారికి ఇచ్చిన వాగ్దానాలు, నెరవేర్చిన క్రమం, తమ తప్పు తెలుసుకొని ఆ పిల్లలు పడే పశ్చాత్తాపం ఈ సినిమాకు మెయిన్ హైలెట్.
Five enough
ఓ ఒంటరి మహిళ, ఓ ఒంటరి పురుషుడు.. వారి ఐదుగురు పిల్లలు.. ఈ సమహరమే ఈ సినిమా కథ. ఆ మహిళ, అ పురుషుడు ప్రేమించుకోవడం.. వారి ప్రేమకు ఆ ఐదుగురు పిల్లలు అడ్డు చెప్పడం.. వారి అభిమానాన్ని చూరకొనేందుకు ఆ ఒంటరి మహిళ, పురుషుడు పడే తాపత్రయం.. చివరికి వారి ప్రేమను ఆ పిల్లలు ఒప్పుకోవడం.. వీటి సమాహారమే ఈ సినిమా కథ. చూస్తున్నంత సేపు న్యూ ఏజ్ మూవీ లాగా ఉంటుంది. ఇందులో ఉన్న భావోద్వేగాలు కంట నీరు పెట్టిస్తాయి.
Smile you
ఓ యువతి, యువకుడు మధ్య ప్రేమ.. వారి మధ్య తగాదాలు.. అనంతరం ఒకరినొకరు అర్థం చేసుకోవడం.. ఆ తర్వాత సాగించే దూర ప్రయాణాలు.. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు.. వీటన్నిటిని అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాలు కచ్చితంగా యువతరం చూడాలి.. తల్లిదండ్రులు కూడా తిలకించాలి. ఎవరి బాధ్యత ఏమిటో గుర్తుకు తెచ్చే సినిమా ఇది.
My blues
బైజూస్ ద్వీపంలో నివసించే కొన్ని జంటల జీవిత కథ ఈ సినిమా.. వారి మధ్య అలకలు, తగాదాలు, ప్రేమలు, అనుబంధాలే ఈ సినిమా. కాకపోతే ప్రతి సందేశం ఆసక్తికరంగా ఉంటుంది.
Hi bye mama
తన ఐదు సంవత్సరాల కూతురు ఉన్న ఓ మహిళ ఆకస్మాత్తుగా చనిపోతుంది. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి వస్తుంది. తన కూతురికి తల్లి ప్రేమను అందిస్తుంది. అయితే ఒక దయ్యం తిరిగి తల్లిగా రావడం.. ఆమె చేసే పనులు.. వాటిని కుటుంబ సభ్యులు అడ్డుకోవడం ఇవన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. చివర్లో తన కూతుర్ని వదిలిపోయే సన్నివేశమైతే ఈ సినిమాకు మెయిన్ హైలెట్.
Dear my friends
చాలామంది వృద్ధులు అంటే చీదరించుకుంటారు. వారు ఏం చెప్పినా వినిపించుకోరు. అందుకే కొంతమంది వృద్ధులు తమ పిల్లల్ని వదిలి ఒక ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? తమ ఒంటరితనాన్ని వాళ్లు ఎలా పోగొట్టుకున్నారు? అనే ప్రశ్నలకు దర్శకుడు ఇచ్చిన సమాధానం ఈ సినిమాకు ప్రధాన బలం.