Koratala Siva’s NTR30: కొరటాల శివ ఎన్టీఆర్ (Jr NTR) తో ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వస్తోన్న రెండో సినిమా ఇది. నవంబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనబడట్లేదు. కొరటాల చెప్పిన ఫుల్ స్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చలేదు. ఎన్టీఆర్ కి కొరటాల శివ ఆ మధ్య ఒక స్టోరీ లైన్ చెప్పారు.
ఆ లైన్ తారక్ కి బాగా నచ్చింది. పైగా కొరటాల పై ఎన్టీఆర్ కి నమ్మకం ఉండటంతో మొత్తానికి సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ లోపు కొరటాల ఆ లైన్ ను పూర్తి స్క్రిప్ట్ గా మార్చారు. కానీ ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కి నచ్చలేదు. కారణం.. కొరటాల స్క్రిప్ట్ పై ఎక్కువ వర్క్ చేయకపోవడమే అని తెలుస్తోంది.
‘ఆచార్య’తో బిజీగా ఉండడం వల్ల.. కొరటాలకు ఎక్కువ టైం దొరకలేదు. ఇక ఎలాగూ ‘ఆచార్య’ సినిమా చివరి దశలో ఉంది. ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే.. కొరటాల శివ స్క్రిప్ట్ పై కూర్చుంటారట. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ వర్క్ చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్ తో కథా చర్చలు చేయాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు.
ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తారు. కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మించే ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ సహ నిర్మాత. అయితే, ఈ సినిమాలో కొంత భాగం పీరియాడిక్ డ్రామా ఉంటుందట. అందుకే బారీ బడ్జెట్ అవుతుందని అంటున్నారు. ఎలాగూ ఎన్టీఆర్ సినిమాకి మార్కెట్ కూడా వర్కౌట్ అవుతుంది.
అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. ఇక ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.