Acharya Dharmasthali: ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో వస్తున్న ఆచార్య కోసం కొరటాల శివ వరుస ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ మాట్లాడుతూ.. ‘ఆచార్య సినిమా అనుకున్నపుడే.. ఓ మంచి టెంపుల్ టౌన్ కావాలనుకున్నాం. మేము చాలా ప్రాంతాలు చూసి వచ్చాం. కాకపోతే, మాకు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు అంశాలు నచ్చాయి. అందుకే, అవ్వన్నీ ఒక చోట చేర్చి ‘ధర్మస్థలి’సృష్టించాం.

‘ధర్మం’గురించి చెప్పే కథ కాబట్టి ఆ టౌన్ పేరు కూడా ధర్మస్థలి అని పేరు పెట్టాం’ అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు. అలాగే కొరటాల ఇంకా మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ సురేశ్ ఎన్నో దేవాలయాలను సందర్శించి మా సినిమా సెట్ నిర్మించారు. కోట్ల రూపాయలను ఖర్చు చేసి 20 ఎకరాల్లో సెట్‌ని నిర్మించాం’అని కొరటాల శివ చెప్పుకొచ్చారు.
Also Read: Prithvi: కన్న కొడుకుకు అలా జరగడంతో డిప్రెషన్ లోకి వెళ్లా.. పృథ్వీ కామెంట్స్ వైరల్!
మొత్తానికి ఈ మెగా మూవీకి మహేష్ మాట సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇది వరకే మహేష్ బాబు పలు సినిమాలకి వాయిస్ ఓవర్ ఇచ్చి.. ఆ సినిమాల సక్సెస్ లో భాగం అయ్యాడు. ఎన్టీఆర్ బాద్షా కి, పవన్ కళ్యాణ్ జల్సాకి కూడా మహేష్ తన వాయిస్ ఇచ్చాడు. పైగా ‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే మెగాస్టార్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ప్రతి సీన్ విషయంలో చిరు ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నారు. అన్నట్టు ఆచార్యలో చరణ్ పాత్ర ఎంతసేపు ఉంటుంది ? ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండబోతుంది.
చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రన్ టైం సుమారు 2 గంటల 58 నిమిషాలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడు.
Also Read:Edida Nageswara Rao: తెలుగు సినిమాకు ఖ్యాతిని తెచ్చిన నిర్మాతకు గౌరవం ఏది ?
Recommended Videos:



[…] Meena: సీనియర్ హీరోయిన్ ‘మీనా’ అంటేనే.. హోమ్లీ బ్యూటీ అని పేరు. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్న సమయంలోనే మీనా ఎప్పుడు హద్దులు మీరి పరిధి దాటలేదు. కానీ ఓ వెబ్ సిరీస్ కోసం తాజాగా ఆమె ఒక బోల్డ్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ వయసు అయిపోయినా.. ఇప్పటికి ఆమెలోని గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అంటూ తమిళ డైరెక్టర్ జీవన్, ‘మీనా’ మెయిన్ లీడ్ గా ఒక సిరీస్ చేయడానికి కసరత్తులు చేస్తున్నాడు. […]
[…] Eesha Rebba: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను అంగీకరిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కథతో, ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ధమాకా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బ నటిస్తుందని తెలుస్తోంది. […]