https://oktelugu.com/

సుకుమార్ దారిలో కొరటాల..

ఇంతకు ముందు హిందీలో ఉన్న సంప్రదాయం ఇపుడు తెలుగులోకి వచ్చింది డైరెక్టర్ గా స్థిరపడిన స్టార్ డైరెక్టర్లలో కొంత మంది తమ దగ్గర పనిచేసిన సహాయ దర్శకులకు తామే అవకాశం కల్పిస్తున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఒక కొత్త బ్యానర్ స్థాపించి తమ శిష్యుల్లో ప్రయోజకులైన వారిని కనిపెట్టి .తామే ప్రమోట్ చేస్తున్నారు తెలుగు సినీ రంగానికి సంబంధించి ఇలా చేస్తున్న వారిలో దర్శకుడు సుకుమార్ ముందు వరుసలో ఉండి అందరికీ ఆదర్శం అయ్యాడు. తెలుగులో శిష్యులను […]

Written By:
  • admin
  • , Updated On : April 15, 2020 3:59 pm
    Follow us on


    ఇంతకు ముందు హిందీలో ఉన్న సంప్రదాయం ఇపుడు తెలుగులోకి వచ్చింది డైరెక్టర్ గా స్థిరపడిన స్టార్ డైరెక్టర్లలో కొంత మంది తమ దగ్గర పనిచేసిన సహాయ దర్శకులకు తామే అవకాశం కల్పిస్తున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఒక కొత్త బ్యానర్ స్థాపించి తమ శిష్యుల్లో ప్రయోజకులైన వారిని కనిపెట్టి .తామే ప్రమోట్ చేస్తున్నారు తెలుగు సినీ రంగానికి సంబంధించి ఇలా చేస్తున్న వారిలో దర్శకుడు సుకుమార్ ముందు వరుసలో ఉండి అందరికీ ఆదర్శం అయ్యాడు. తెలుగులో శిష్యులను ఎంకరేజ్ చేసే వారిలో వి వి వినాయక్ ,శేఖర్ కమ్ముల , మారుతి , త్రివిక్రమ్ శ్రీనివాస్,పూరీ జగన్నాధ్ లాంటి దర్శకులు ఉన్నప్పటికీ సుకుమార్ లాగా బ్యానర్ స్థాపించడం మాత్రం జరగలేదు . కాగా ఇపుడు ఇంకో స్టార్ డైరెక్టర్ కూడా సుకుమార్ ని అనుసరించడానికి రెడీ అవుతున్నాడు
    .
    ఇప్పటిదాకా ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. వరుసగా మిర్చి ,శ్రీమంతుడు , జనతా గారేజ్ , భరత్ అనే నేను వంటి నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకి అందించాడు . ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరో గా ‘ఆచార్య’ సినిమా తీస్తూ బిజీగా ఉన్నాడు .. అయితే లాక్ డౌన్ కారణంగా ‘ఆచార్య’కు బ్రేక్ పడడంతో ఖాళీ సమయంలో ఒక మంచి ఆలోచన వచ్చిందట .. కొరటాల శివ కి …. సుకుమార్ రైటింగ్స్ మాదిరిగా ఓ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, తన అసిస్టెంట్స్ కి డైరెక్టర్ అయ్యే అవకాశం ఇవ్వాలని అనుకొంటున్నాడట …

    స్వతహాగా రైటర్ అయిన కొరటాల శివ కొన్ని వందల పుస్తకాలు రాసాడట … ఇపుడు ఆ కథలతో తన అసిస్టెంట్ లను డైరెక్టర్స్ గా ప్రమోట్ చేయాలన్నది కొరటాల ప్లాన్. మొదటగా కొరటాల శివ దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ లేడీ అసిస్టెంట్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఆ లేడీ డైరెక్టర్ గురించి లాక్ డౌన్ ముగిశాక చేబుతాడట ..