NTR- Koratala Siva Movie: చాలా అంచనాల నేపథ్యంలో కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్ గా బాగా సక్సెస్ అయింది. పైగా ఎన్టీఆర్ కెరీర్ లో జనతా గ్యారేజ్ క్లాసిక్ అని చెప్పాలి. ఎన్టీఆర్ ని కొరటాల సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ఈ మూవీ టీవీలో ప్రసారమైన ప్రతిసారి జనాలు విసుగు లేకుండా చూస్తారు.

జనతా గ్యారేజ్ లో మెసేజ్, కామెడీ, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి కొరటాల మంచి హిట్ కొట్టాడు ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలుస్తుంది. ఈ కారణంతోనే ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ ను బలంగా కోరుకుంటున్నారు. కాగా అనేక కారణాలతో ఈ సినిమా షూట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
Also Read: AP High Court- Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నిషేధంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఎన్టీఆర్ – కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ, ఆచార్య ప్లాప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రచారం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చే నెలలో స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది, అయితే, ఇప్పటికే ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారట. 2023 మే 28న ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అసలు షూటింగ్ కూడా మొదలు పెట్టకుండా రిలీజ్ డేట్ ను ఎలా ఫిక్స్ చేసుకుంటారు ?, అందులోనూ అతి తక్కువ సమయం మాత్రమే ఉంది. చెప్పిన ప్రకారం విడుదల చేయాలంటే ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి. కొరటాల శివ అంత వేగంగా షూట్ చేయగలడా ?, పైగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా ఇది.
ఆరు నెలలు షూట్ కి పోయినా మరో నెల నెలన్నర కాలంలో పోస్ట్ ప్రొడక్షన్ ముగించాలి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో మూవీ ఇంత తక్కువ టైం లో కంప్లీట్ అవుతుందా అనే సందేహం కలుగుతుంది. కొరటాల శివ ఆచార్య చిత్రాన్నే మూడేళ్లకు పైగా షూట్ చేశారు. ఇప్పుడేమో ఎన్టీఆర్ సినిమాని ఎనిమిది నెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తా అంటున్నారు. నమ్మేది ఎలా ?
Also Read:Anupama Parameswaran: షాకింగ్ న్యూస్… సినిమాలకు గుడ్ బై చెప్పిన అనుపమ?
[…] […]
[…] […]
[…] […]