https://oktelugu.com/

Kondapolam Telugu Movie Review: కొండపొలం మూవీ రివ్యూ- హిట్టా ? ఫట్టా ?

Kondapolam Telugu Movie Review: రివ్యూ : కొండపొలం – రేటింగ్ 2.75 నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు. దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి సంగీతం : ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్ ఎడిటర్ : శ్రావన్ కటికనేని నిర్మాతలు : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ […]

Written By: , Updated On : October 8, 2021 / 03:55 PM IST
Follow us on

Kondapolam Telugu Movie Review

Kondapolam Telugu Movie Review

Kondapolam Telugu Movie Review: రివ్యూ : కొండపొలం –

రేటింగ్ 2.75

నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు.

దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి

సంగీతం : ఎంఎం కీరవాణి

సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్

ఎడిటర్ : శ్రావన్ కటికనేని

నిర్మాతలు : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో ఏకంగా 80 కోట్లు కలెక్ట్ చేసి.. తనకంటూ స్టార్ డమ్ తో పాటు మార్కెట్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. అందుకే, రెండో సినిమా ‘కొండపొలం’కి మంచి బజ్ క్రియేట్ అయింది. పైగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.

కథ :

రవి (పంజా వైష్ణవ్ తేజ్) ఇంజనీరింగ్ వరకూ చదివి జాబ్ లేక.. తిరిగి ఊరికి వస్తాడు. అయితే గొర్రెలు కాసుకునే కుటుంబంలో పుట్టిన అతను తన తండ్రీతో కలిసి కొండపొలానికి గొర్రెలు కాయడానికి వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో అడవిలో రవి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు ? ఓబులమ్మ ( రకుల్ ప్రీత్ సింగ్) తో అతని ప్రేమ కథ ఎలా సాగింది ? వాళ్ల ప్రేమకు వచ్చిన అడ్డంకి ఏమిటి ?
చివరకు ఓబులమ్మ ప్రేమను రవి గెలుచుకున్నాడా ? లేదా ? ఈ మధ్యలో అడవి నుంచి అతను నేర్చుకున్నది ఏమిటి ? అతని జీవితాన్ని ఆ కొండపొలం ఎలా మార్చింది ? చివరకు అతను ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

కచ్చితంగా ఈ సినిమా కొత్తగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అయితే అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు. కథ నేపథ్యం, పాత్రలు బాగున్నా.. సినిమా చూస్తున్నంత సేపు మంచి ఫీలింగ్ కలిగినా.. ప్లే ఆసక్తకరంగా లేదు. అయితే, రవి పాత్రలో వైష్ణవ్ తేజ్ చాలా బాగా నటించాడు. ఎమోషనల్‌ గా సాగే తన పాత్రలో తన కళ్లతోనే సున్నితమైన భావోద్వేగాలను
పండించాడు. ఓబులమ్మగా రకుల్ నటన కూడా ఆకట్టయింది. అలాగే సినిమాలో అంతర్లీనంగా ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది.

క్రిష్ సినిమాకు పూర్తి న్యాయం చేసినా ఆయన కథనం ఆకట్టుకోదు. కీరవాణి అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫర్
జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ కూడా చాలా సహజంగా ఉంది. మెయిన్ గా అడవిలో హీరోకు ఎదురయ్యే అనుభవాలను చాలా బాగా చూపించారు. అయితే సినిమాలో కథను మొదలు పెట్టడంలో క్రిష్ పెర్ఫెఫ్ట్ గా సీన్స్ ను రాసుకోలేదు. కాకపోతే, పాత్రల మధ్య ఎమోషన్స్ బాగున్నాయి.

ఇక తాతగా కోట, తండ్రిగా సాయిచంద్ అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు. ఓవరాల్ గా సినిమాలో హైలైట్ అయింది మాత్రం వైష్ణవ్ తేజే. అడవిలో కర్ర పుల్లను చూసి కూడా భయపడిన హీరో, చివరకు అదే అడవిలో పులిని కూడా ఎదిరించే సాహస వంతుడిగా మారిన విధానం అద్భుతంగా అనిపించింది. నేటి ఓటమి రేపు విజయనే కోణంలో సాగిన ఈ సినిమాలోని మెయిన్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

వైష్ణవ్ తేజ్ నటన,

సాయి చంద్, రకుల్ నటన,.

కథ,

ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా,

డైలాగ్స్, సంగీతం,

క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్ లో స్లో సాగే ప్లే,

బోరింగ్ డ్రామా,

రొటీన్ సీన్స్, కామెడీ కోసం ఇరికించిన ట్రాక్,

సినిమా చూడాలా ? వద్దా ?

‘కొండపొలం’ నవల ఆధారంగా వచ్చిన ఈ కొండపొలం’లో ఎమోషన్స్ బాగున్నాయి. ఈ మధ్య రెగ్యులర్ సినిమాల పరంపరలో నలిగిపోతున్న ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతి ఇస్తోంది. అయితే అర్ధవంతమైన కంటెంట్ ఉన్నా, విలువైన మెసేజ్ తో పాటు సహజమైన పాత్రలు ఉన్నా.. సినిమా ఎవరేజ్ గానే నిలిచింది. అయితే, కచ్చితంగా ఈ సినిమాని ఒకసారి హ్యాపీగా చూడొచ్చు.