
Kondapolam Movie Preview: నిన్న రాత్రి సినీ ప్రముఖుల కోసం ‘కొండపొలం’ సినిమా ప్రివ్యూ వేశారు. సినిమా చూసిన వారంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఉప్పెన ఎంత పెద్ద హిట్ అయినా, అది వైష్ణవ్ తేజ్ కి దక్కిన అదృష్టం తప్ప, అతని ప్రతిభకి వరించిన విజయం కాదు అని కామెంట్స్ వినిపించాయి. కానీ, ‘కొండపొలం’ వైష్ణవ్ తేజ్ ప్రతిభకు రాబోతున్న విజయం. అతని టాలెంట్ ను పరిపూర్ణంగా చూపిస్తున్న సినిమా ఇది. సినిమాలో వైష్ణవ్ నటన చాలా బాగుంది.
ముఖ్యంగా పిల్లిని చూసి కూడా భయపడే ఓ కుర్రాడు, పులిని కూడా ఎదిరించే సాహస వంతుడిగా ఎలా మారాడు అనే కోణంలో సాగిన ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. వైష్ణవ్ తేజ్ ఈ ‘కొండపొలం’తో స్టార్ అవుతాడు. అంతలా అతని పాత్ర కుదిరింది. మెగాస్టార్ కి ఖైదీ ఎలాగో.. వైష్ణవ్ కి ఈ సినిమా అలా అని సినిమా చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాలో ఇచ్చిన మెసేజ్ కూడా హైలైట్ అవ్వనుంది. కొన్ని వాస్తవ జీవితాలను నుంచి పాత్రలను రాసుకుని, ఆ పాత్రలకు తెరపై జీవం పోసి, సినిమాగా తీశాడు క్రిష్. అంత సహజంగా ఉంది సినిమా. ఇక సినిమాలో రకుల్ ఓబులమ్మ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో చూడాలి.
అయితే, వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనకి 80 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. దీనిబట్టి రెండో సినిమాకి కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ నిజంగానే ఆ స్థాయి వసూళ్లు వస్తే.. వైష్ణవ్ కి స్టార్ డమ్ వచ్చేసినట్టే. ఎలాగూ ఇదొక వైవిధ్యమైన సినిమా. అటవీ ప్రాంతంలో ఈ సినిమా నేపథ్యం సాగనుంది.
కచ్చితంగా ఈ సినిమా కొత్తగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. నిజానికి సినిమా కూడా అలాగే ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అందుకే దర్శక-నిర్మాత క్రిష్ ఈ సినిమాకి ఎన్నిసార్లు ఓటీటీ ఆఫర్లు వచ్చినా సినిమాని అమ్మలేదు పైగా ఎక్కువ థియేటర్స్ లో ఓన్ రిలీజ్ కి క్రిష్ సిద్ధం అవ్వడం విశేషం.
అయితే ఈ చిత్ర కథ చాలా సహజంగా ఉంటుంది. అందుకే, సినిమా బాగా స్లో నేరేషన్ లో సాగింది. పైగా కథలో చాలా పాత్రలు ఉంటాయి. కొన్ని పాత్రలకు బలమైన సంఘర్షణ లేకపోవడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. పైగా ఆ పాత్రలు కూడా పూర్తిగా కమర్షియల్ అంశాలకు దూరంగా సాగేవి.
కాగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సింగీతం అందిస్తున్నారు.