‘Konda’ Trailer: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా పేరు ‘కొండా’. తెలంగాణ రాజకీయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండా దంపతుల నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఈ ‘కొండా’ సినిమాను తీసుకురాబోతున్నాడు. కాగా 1980వ సంవత్సరం జరిగిన ఘటన ఆధారంగా కొండా సురేఖ, మురళి ప్రేమ కథకు కాస్త మసాలా యాడ్ చేసి ఈ సినిమాను చేస్తున్నాను అంటూ వర్మ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా ‘కొండా’ సినిమా ఇటీవల ఆఖరి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. రేపు ఉదయం 10.25 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఇక కొండా మురళి పాత్రలో నటుడు త్రిగన్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటిస్తున్నారు.మరి రేపు రానున్న ‘కొండా’ ట్రైలర్ లో మ్యాటర్ ఉంటే.. సినిమా పై ఆసక్తి ఉంటుంది. కానీ, ఇప్పటికి అయితే.. ఈ సినిమా పై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు.
Also Read: ఇంట్లో కూర్చుని నెలకు రూ.60 వేలు సంపాదించవచ్చు.. ఎలా అంటే?

అన్నట్టు ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొండా మురళికి నక్సలైట్ ఆర్కే తో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి కూడా సినిమాలో ప్రత్యేకమైన సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మెయిన్ గా సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. ఈ సినిమాలో అప్పటి కాలంలో జరిగిన అనేక అంశాలను కూడా వెరీ ఇంట్రెస్టింగ్ గా చూపించ బోతున్నారట. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మొత్తమ్మీద కొండా మురళి క్యారెక్టర్ ను సినిమాలో చాలా సీరియస్ గా చాలా హీరోయిజమ్ గా చూపిస్తున్నారట.
Also Read: అప్పటి ముచ్చట్లు : ఫామ్ లో ఉన్న హీరో కంటే.. కథనే ఫామ్ లోకి తెచ్చే హీరో కావాలి !