https://oktelugu.com/

Kobali Movie Review: ‘కొబలి’ ఫుల్ సిరీస్ రివ్యూ & రేటింగ్…ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..?

'కోబలి' (Kobali) అనే పేరుతో రవి ప్రకాష్ మెయిన్ లీడ్ లో నటించిన సిరీస్ ఒకటి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది? సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Written By:
  • Gopi
  • , Updated On : February 5, 2025 / 03:17 PM IST
    Kobali Movie Review

    Kobali Movie Review

    Follow us on

    Kobali Movie Review: ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులోకి రావడంతో చాలా సిరీస్ లు ఆయా ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అయితే చాలా సిరీసులు స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయనే చెప్పాలి… ఇంకా ప్రస్తుతం ‘కోబలి’ (Kobali) అనే పేరుతో రవి ప్రకాష్ మెయిన్ లీడ్ లో నటించిన సిరీస్ ఒకటి ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది? సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో ఎవరితో గొడవలు లేకుండా తన లైఫ్ ను తను సంతోషంగా లీడ్ చేస్తున్న శ్రీను (రవి ప్రకాష్) హ్యాపీగా ఉంటాడు. ఇక తన తమ్ముడు అయిన రాము(తరుణ్ రోహిత్) అనుకోకుండా ఒకరోజు లోకల్ రౌడీ అయిన రమణ (రాకీ సింగ్) తో గొడవ పెట్టుకుంటాడు. ఇక దాంతో శీను కూడా ఆ గొడవలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మొత్తానికైతే రమణ ధాటికి శ్రీను కుటుంబం మొత్తం అతలాకుతలం అవ్వడమే కాకుండా చాలా ఇబ్బందుల్లో పడతారు. మరి ఎట్టకేలకు శీను తన తమ్ముడు అయిన రాముని రక్షించాడా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..ఆ రౌడిని ఎలా అంతం చేశాడు అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే ‘కోబలి’ అనే టైటిల్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా మంచి సంబంధమైతే ఉంది. అతని అభిమానులు ఆ టైటిల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ హీరోగా ఈ సినిమా వస్తుంది అనుకున్నప్పటికి ఆ టైటిల్ తోనే ఈ సీరీస్ రావడం అనేది కొంతవరకు కొంతమందిని నిరాశపరిచిందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా దర్శకుడు ఈ సిరీస్ ని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ తను అనుకున్నది ఏదీ వర్కౌట్ కాలేదు…

    నిజానికి కొంతమంది దర్శకులు ఓటిటి ప్లాట్ ఫామ్ లో సినిమా అంటే బూతులు, శృంగారపు సీన్లు రక్తపాతం చూపించే ఫైట్లు మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఒక మంచి కథని కూడా చెప్పొచ్చు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు కూడా అలాంటి పద్ధతినే అనుసరించాడు విపరీతమైన రక్తపాతం, నరుక్కోవడం లాంటి సన్నివేశాలను చూస్తే ఈ సిరీస్ ని చూసిన చాలామంది మధ్యలోనే స్కిప్ చేస్తూ ఉంటారు. ఇక కథని ఎక్కడో మొదలుపెట్టి ఇంకేక్కడో ముగించారు. ఇక దర్శకుడు సిరీస్ ను డ్రైవ్ చేసిన విధానం బాగాలేదు. ఇక దాంట్లో దర్శకత్వ ప్రతిభ కూడా అంత పెద్దగా ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు… రవి ప్రకాష్ క్యారెక్టర్ బాగా తీర్చిదిద్దినప్పటికి ఆయన క్యారెక్టర్ ను నడిపించిన విధానం అయితే ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వదు. దానివల్ల ప్రేక్షకుడు ఈ సిరీస్ మంచి డిస్ కనెక్ట్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…

    ఇక రక్తపాతం కొలిపే సన్నివేశాలకైతే హద్దు అదుపు లేకుండా తన ఇష్టం వచ్చినట్టుగా చేశారు… ఇక మ్యూజిక్ విషయంలో కూడా ఈ సిరీస్ కొంతవరకు నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. ఇక మ్యూజిక్ అంత పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు. సీన్ లో ఉన్న ఎమోషన్ కూడా సరిగ్గా పండలేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి… ఇక తను ఎంచుకున్న పాయింట్ ని రక్తపాతం లేకుండా చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తే కోబలి కొంతమంది ప్రేక్షకులనైనా అలరించేదేమో కానీ ఇప్పుడు మాత్రం ఏ వర్గం ప్రేక్షకుల్ని కూడా ఈ సిరీస్ అలరించే విధంగా అయితే లేదు…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రవి ప్రకాష్ చాలా అద్భుతమైన పాత్రను పోషించాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి ఫుల్ లెంత్ మెయిన్ లీడ్ రోల్ క్యారెక్టర్ రావడం అనేది చాలా మంచి విషయం. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన క్యారెక్టర్ లో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. కానీ కథ ప్రేక్షకుడికి కనెక్ట్ కాకపోవడంతో అతని క్యారెక్టర్ ను ప్రేక్షకుడు ఓన్ చేసుకోలేకపోయాడు. ఇక శ్యామల పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆమె కూడా తన బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది.ఇక విలన్ గా చేసిన రాఖీ సింగ్ సైతం ఎంత సేపు రక్తపాతపు సన్నివేశాల్లోనే ఎక్కువగా కనిపించాడు.

    ఇక యాక్టింగ్ కి స్కోప్ ఉన్న సన్నివేశాల్లో కూడా ఆయన బాగా పర్ఫామ్ అయితే చేయలేకపోయాడు. మిగతా ఆర్టిస్టులందరూ కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు తప్ప ఒక్కరి క్యారెక్టర్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా రాసుకోలేకపోయారు. ఇక వాళ్ల పాత్రలను ఎలా నడిపించాలో డైరెక్టర్ కి అర్థం కానట్టుగా ఉంది. అందువల్లే డిస్టర్బెన్స్ అయితే వచ్చినట్టుగా అర్థమవుతుంది…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాలు కూడా పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు. మ్యూజిక్ అయితే చాలా వరకు నిరశపరిచింది. ఇక విజువల్స్ కూడా కొన్ని సీన్లలో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉన్నప్పటికి ఓవరాల్ గా చూస్తే కనుక అవి కూడా అంత పెద్దగా ఎలివేట్ అయితే అవ్వలేదు. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కొంతవరకు బెటర్ గా అనిపించాయి. ఎడిటింగ్ పనితీరు అయితే చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. కొన్ని సీన్లు షార్ప్ ఎడ్జ్ లో కట్ చేయొచ్చు కానీ అలా చేయకుండా దాన్ని సాగదీసినట్టుగా చేశారు…

    ప్లస్ పాయింట్స్

    రవి ప్రకాష్ యాక్టింగ్
    మొదటి ఎపిసోడ్

    మైనస్ పాయింట్స్

    కథ
    స్క్రీన్ ప్లే
    డైరెక్షన్
    రక్తపాతం
    బూతులు

    రేటింగ్

    ఈ సీరీస్ కి మేమిచ్చే రేటింగ్. 1.5/5