https://oktelugu.com/

Tamannaah Bhatia : అంత లేలేతగానా.. తొలి సినిమా టైంలో తమన్నా వయసు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

2005లో విడుదలైన చాంద్ స రోషన్ చెహ్రా సినిమాలో మొదటి సారిగా నటించింది. ఆ అవకాశం వచ్చినప్పుడు అమ్మడు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే.

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2023 / 03:07 PM IST
    Follow us on

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ను ఏలిన హీరోయిన్. అందం, నటనతో ఎంతో మందిని ఫిదా చేసి ఏకంగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ ను అందుకుంది ఈ మిల్క్ బ్యూటీ. దాదాపుగా అందరి సరసన నటించి హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న స్టార్ హీరోయిన్ లలో ఒకరు తమన్నా. కానీ ఈ ప్లేస్ సంపాదించిడానికి అమ్మడు చాలా కష్టపడింది. అయితే కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.

    ప్రేమ కావ్యాలు అద్భుతంగా తెరకెక్కించే శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాతో పాపులర్ అయింది తమన్నా. ప్రముఖ నటి తమన్నా భాటియా వయసు ఇప్పుడు 33 ఏళ్లు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ లలో ఈ అమ్మడుకు మంచి మార్కెట్ కూడా ఉంది. అయితే ఈ అమ్మడు ముందుగా హిందీ సినిమాలతో హీరోయిన్ గా పరిచయమై.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.

    ఇప్పుడు తమన్నాకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో దాదాపు 18 ఏళ్ల క్రితం నాటిది. ఇందులో తమన్నా తన మొదటి సినిమా గురించి మాట్లాడింది. తొలి సినిమా చేసిన సమయంలో ఆమె స్కూల్ లో చదువుతున్నా అని తెలిపింది. ఇది విన్న నెటిజన్లు షాక్ అవుతూ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈమె హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు 36 ఏళ్ల మహిళగా కనిపించేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు .

    2005లో విడుదలైన చాంద్ స రోషన్ చెహ్రా సినిమాలో మొదటి సారిగా నటించింది. ఆ అవకాశం వచ్చినప్పుడు అమ్మడు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే. అప్పటి అనుభవాలను తలుచుకుంటూ మాట్లాడడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇంతకీ ఏం మాట్లాడిందంటే… ‘నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. 2005లో 10వ తరగతి పరీక్ష రాయడానికి సిద్దమవుతున్నాను. అంటే ఈ సినిమాకి సంతకం చేసినప్పుడు నా వయసు పదమూడున్నరేళ్లు అని పేర్కొంది తమన్నా భాటియా.