
పుష్ప టీజర్ విడుదలైన సంచలనాలు సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ టీజర్ లో విశ్వరూపమే చూపాడు. సోషల్ మీడియాను ఊపు ఊపాడు. మరోవైపు టీజర్ యూట్యూబ్‌లో 30 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.ఇది ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో ఉంది. ఈ పుష్ప చిత్రానికి కాను సుకుమార్ కు ఎంత పారితోషికం.. బన్నీ రెమ్యూనరేషన్ ఎంతనే దానిపై ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది..
పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ రూ .35 కోట్లు, దర్శకుడు సుకుమార్ కు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ సమాచారం. సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ హీరో ఫహద్ ఫాజిల్‌కు 5 కోట్ల రూపాయలు, హీరోయిన్ రష్మిక మండన్నకు రూ .2 కోట్లు చెల్లిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నాని మరియు వై.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. దీనికి గాను దేవీశ్రీకి రూ. 2 కోట్లు వసూలు చేస్తున్నాడు.
అల్లు అర్జున్, సుకుమార్ లకు ఇది మొదటి పాన్ ఇండియన్ చిత్రం. ఈ చిత్రం ఒకేసారి తెలుగు, హిందీ భాషలలో చిత్రీకరించబడుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరియు హిందీ భాషలలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.