Kishkindhapuri OTT Release: చాలా కాలం తర్వాత ప్రముఖ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘కిష్కిందపురి'(Kiskindhapuri Movie) అనే హారర్ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్నాడు. అల్లు అదుర్స్ చిత్రం తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, భైరవం చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది, కానీ బెల్లంకొండ కి కెరీర్ పరంగా, మార్కెట్ పరంగా ఈ చిత్రం ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఈ సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత ‘కిష్కిందపురి’ వచ్చింది. ఈ సినిమా విడుదలైన రోజునే తేజ సజ్జ ‘మిరాయ్’ చిత్రం కూడా విడుదలైంది. ఆ సినిమాకు మొదటి నుండే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడం తో, ఓపెనింగ్స్ బలంగా వచ్చాయి. ఆ ప్రభావం ‘కిష్కిందపురి’ చిత్రం పై చాలా గట్టిగా పడింది.
కానీ లాంగ్ రన్ లో మాత్రం బలమైన హోల్డ్ ని చూపించి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. ఆడియన్స్ నుండి కూడా రివ్యూస్ అద్భుతంగా వచ్చాయి. ఈమధ్య కాలం లో ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్ మీద తెరకెక్కిన హారర్ చిత్రం రాలేదని, థియేటర్ లో అనేక సన్నివేశాలకు గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చాయని చూసిన ప్రతీ ఒక్కరు రివ్యూస్ ద్వారా తెలిపారు. ఇదంతా పక్కన పెడితే మీడియం రేంజ్ హీరోల సినిమాలను ఈమధ్య కాలం లో ఆడియన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. టాక్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు థియేటర్ కి వెళ్లడం?, నాలుగు వారాలు దాటితే ఓటీటీ లోకి వచ్చేస్తుంది అనే మూడ్ లోకి వెళ్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఒక శుభ వార్త. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది.
ఈ నెల 17వ తారీఖున ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా కూడా విడుదల చేయబోతున్నట్టు జీ5 సంస్థ అధికారిక ప్రకటన చేసింది. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకొని సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, ఓటీటీ ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. సినిమాలో అనేక సన్నివేశాలు ఆడియన్స్ కి నిజమైన భయాన్ని కలిగిస్తాయి. హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాని మిస్ అవ్వొద్దు.