Pawan Kalyan Direction: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలకు మంచి క్రేజ్ అయితే ఉంటుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే అతను చేస్తున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే మంచిదని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక ఇప్పుడు మరోసారి తనను తాను స్టార్ హీరోకి ఎలివేట్ చేసుకోవాలంటే జాగ్రత్తగా సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉందని ఆయన అభిమానులు అభిప్రాయాపడుతున్నాడు. ఇక ఓజీ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన తన తదుపరి సినిమా విషయంలో కూడా ఇంకాస్త ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా చేసిన ఆయన ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత రెండు మూడు రోజుల నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం అనిల్ రావిపూడి కంటే పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
ఆయన తీసే షాట్స్ కొత్త అనిపిస్తాయి. జానీ సినిమాలో మాకు అది కనిపించిందని కావాలంటే మీరు మీ డైరెక్షన్ లోనే సినిమా చేయండి…అంతే కానీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాత్రం సినిమా చేయడం వేస్ట్ అని చెబుతున్నారు.ఇక గతంలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కోసం మొదట సంపత్ నందిని డైరెక్టర్ గా అనుకున్నారు.
సంపత్ నంది కి పవన్ కళ్యాణ్ ని హ్యాండిల్ చేసే కెపాసిటి లేదనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ అతన్ని పక్కనపెట్టి బాబీ ని డైరెక్టర్ గా తీసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి కొన్ని కుళ్ళు జోకులు, రెండు మూడు ఫైట్లతో సినిమాను నడిపిస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్లే అతనితో సినిమా చేయకపోవడమే బెటర్ అని అతని ఫ్యాన్స్ చెబుతున్నారు…