Nenu Meeku Baga Kavalsina Vadini Movie Review: నటీనటులు: కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ మరియు సోనూ ఠాకూర్, ఎస్ వి కృష్ణా రెడ్డి, బాబా భాస్కర్
దర్శకుడు: శ్రీధర్ గాధే
నిర్మాత: కోడి దివ్య దీప్తి
సంగీత దర్శకుడు: మణి శర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కిరణ్ అబ్బవరం – సంజన ఆనంద్ జంటగా దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో వచ్చిన “నేను మీకు బాగా కావాల్సిన వాడిని”. ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
Also Read: Oscars 2023- NTR and Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు ఆస్కార్?
కథ :
పవన్ (కిరణ్ అబ్బవరం) వివేక్ అనే పేరుతో క్యాబ్ డ్రైవర్ గా తేజు (సంజన ఆనంద్)తో పరిచయం పెంచుకుంటాడు. అయితే, అప్పటికే.. లవ్ ఫెయిల్యూర్ తో పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోతుంది తేజు. ఆమె ప్రేమ కథ విని, అసలు ఆమె ఎందుకు అలా ఉంది అని తెలుసుకుంటాడు వివేక్. ఆమె గతం విని వివేక్ ఏం చేశాడు ?, అసలు వివేక్ ఎవరు ?, అతని జీవితంలో ఉన్నా లాయర్ దుర్గ ఎవరు ? ఇలా ఈ కథ అనేక అనుమానాలతో సిల్లీ సీన్స్ తో సాగింది. పోనీ కథనంలో నైనా మ్యాటర్ ఉందా అంటే.. ఆ విషయంలోనూ ఈ చిత్రం పూర్తిగా చేతులు ఎత్తేసింది. ఇంతకీ ఈ కథ బాగోతం ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంటూ వచ్చిన ఈ సినిమా ఎవరికి అవసరం లేదు, ఈ సినిమా మాకొద్దు అన్నట్టు ఉంది ఈ సినిమా అవుట్ ఫుట్. క్యారెక్టరైజేషన్ మాడ్యులేషన్ తప్ప, ఎమోషన్ లేని పాత్రలో కిరణ్ అబ్బవరం కనిపించాడు. కానీ సినిమా మొత్తం కిరణ్ అబ్బవరం ఎమోషనల్ గానే ఉంటాడు. కాకపోతే, ఆ ఎమోషన్ మనకు ఇరిటేషన్ అనుకోండి. ఇక ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. కాకపోతే, ముప్పై ఏళ్ల క్రితం ఈ పాయింట్ తో సినిమా చేయాల్సింది.
నిర్మాత కోడి దివ్య దీప్తి గారు కథల పై అవగాహన పెంచుకుంటే మంచిది.
ఇక సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ స్లోగా బోరింగ్ గా సాగుతుంది. అన్నిటికి మించి చిన్న పాయింట్ చుట్టే పూర్తి కథను నడిపితే ఇంట్రెస్ట్ ఏముంటుంది ?, పైగా కథలో ఎక్కడ టర్నింగ్ పాయింట్లు కూడా లేవు. దీనికి తోడు బలమైన సంఘర్షణ కూడా లేదు. ఓవరాల్ గా ఈ
నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొడుతోంది. శ్రీదర్ గాదె దర్శకుడిగా ఈ సినిమాకు మైనస్ అయ్యాడు.
సంగీత దర్శకుడు మణి శర్మ అందించిన సంగీతం సినిమాకి అతి పెద్ద బలం. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కోడి దివ్య ప్రొడక్షన్ డిజైన్ ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ థీమ్,
కొన్ని లవ్ సీన్స్,
నేపథ్య సంగీతం,
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ స్క్రీన్ ప్లే,
రొటీన్ లవ్ ఎమోషనల్ డ్రామా,
హీరో – హీరోయిన్ ట్రాక్,
లాజిక్స్ లేని సీన్స్,
బోరింగ్ ట్రీట్మెంట్,
సినిమా చూడాలా ? వద్దా ?
కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ చిత్రం బాగాలేదు. ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ బాగా రొటీన్ గా స్లోగా సాగుతుంది. అలాగే, వెరీ రెగ్యులర్ వ్యవహారాలతో బాగా బోర్ కొట్టించింది . మొత్తమ్మీద ఈ సినిమా చూడక్కర్లేదు.
రేటింగ్ : 2 / 5
Also Read:Regina Cassandra: నిన్న “మ్యాగీ – మగాడు”.. నేడు ‘లిప్ లాక్ కిస్”.. రెజినా నోటికి అడ్డూ అదుపు ఉండదా?