Oscars 2023- NTR and Ram Charan: దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన శిల్పం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటించేసరికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. సినిమా ఘన విజయం సాధించి అబ్బురపరిచింది. ఇక్కడే కాదు.. దీన్ని నెట్ ఫ్లిక్స్ లో పెడితే.. ఓటీటీలో ఎక్కువ రోజులు ట్రెండింగ్లో ఉండి రికార్డు సృష్టించిన సినిమాగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఇటు థియేటర్లో కలెక్షన్లే కాదు.. ఓటీటీలో రికార్డు సాధించడం విశేషం.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూసి ఎంతో మంది హాలీవుడ్ జనాలు, హాలీవుడ్ దర్శక నిర్మాతలు వేయినోళ్ల పొగిడారు. అక్కడ కూడా కొన్ని అవార్డులు ఆర్ఆర్ఆర్ కోసం వచ్చాయి. దీంతోపాటు కొన్ని రోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘వెరైటీ’ మ్యాగజైన్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ చేసింది.
తాజాగా మరోసారి ఉత్తమ నటుడు కేటగిరిలో ఎన్టీఆర్, రాంచరణ్ లకు.. బెస్ట్ డైరెక్టర్లో రాజమౌళికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ జాబితాని రిలీజ్ చేసింది.
ఆర్ఆర్ఆర్ కు కనుక నిజంగానే ‘ఆస్కార్’ అవార్డ్ వస్తే మాత్రం తెలుగు సినిమాకు దక్కిన అంతర్జాతీయ గౌరవంగా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో హిందీ, ఇతర భాషల చిత్రాలు ఈ ఆస్కార్ కోసం ఎప్పటి నుంచో పోటీపడుతున్నా ఇంతవరకూ దక్కిన దాఖలాలు లేవు. ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కొన్ని దశాబ్దాల క్రితం సినిమాలకు ఆస్కార్ వచ్చింది. ఇక ఇంగ్లీష్ వారు తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కు వచ్చింది. కానీ తెలుగు నేటివిటీ ఉండి.. మనోళ్లు తీసిన సినిమాలకు రాలేదు. ఇప్పుడు ఆ కోరిక నెరవేరడం ఖాయంగా కనిపిస్తోంది.