Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన ‘K ర్యాంప్'(K Ramp Movie) చిత్రం దీపావళి విన్నర్ గా నిల్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. పబ్లిక్ లో పాజిటివ్ మౌత్ టాక్ బాగా ఉండడం తో రెండవ రోజు వసూళ్లు బాగా పుంజుకున్నాయి. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. అదే ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు వెళ్లడం తో దీపావళి కి విడుదలైన అన్ని సినిమాలకంటే టాప్ స్థానం లో నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమాని తొక్కేందుకు కొన్ని ప్రముఖ వెబ్ సైట్లు ఇండియా లో షోస్ మొదలు అవ్వకముందే డిజాస్టర్ రేటింగ్స్ తో సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ చేశారు.
దీనిపై మూవీ టీం చాలా బాధపడింది. సినిమా విడుదలై జనాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సినిమాపై విష ప్రచారం చేయడం మానలేదు. దీంతో విసుగెత్తిపోయిన ఆ చిత్ర నిర్మాత, నెగిటివ్ ప్రచారం చేస్తున్న ఆ వెబ్ సైట్ పై మండిపడ్డాడు. నా కొడకా, మా సినిమా ని తొక్కాలని చూస్తావా, దమ్ముంటే తొక్కురా చూద్దాం, సూపర్ హిట్ అయిన ఒక సినిమాపై ఇంత విషం కక్కుతావా?, నీలాంటోడిని ఉరి తియ్యాలి అంటూ ఆవేశం తో ఊగిపోయాడు. ఆ ఈవెంట్ లో ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం కూడా ఈయనేంటి ఇంత ఫైర్ అయిపోయాడు అనే విధంగా ఎక్స్ ప్రెషన్స్ ని పెట్టడం మనమంతా గమనించొచ్చు. అయితే చివర్లో కిరణ్ అబ్బవరం మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘సినిమా మొదలయ్యేటప్పుడు నిర్మాత రాజేష్ గారి మీద నాకు చాలా మంచి నమ్మకం ఉండేది. ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడు, తాపత్రయం పడుతూ ఉంటాడు, అది చెయ్యాలి సార్, ఇది చెయ్యాలి సార్ అంటాడు, సార్ కి కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. సినిమా కోసం ఏదైనా చేద్దాం అని అంటూ ఉంటాడు. అప్పటి నుండి సినిమా ఎలా మొదలైంది, ఎలా పూర్తి అయ్యిందో తెలియలేదు. థాంక్యూ వెరీ మచ్ అండీ, నిన్న కూడా ట్రిప్ కి వెళ్తున్నప్పుడు ఈ సినిమాని జనాల్లోకి ఇంకా ఎలా తీసుకెళ్లాలి?, సినిమాని ఎలా అయినా నిలబెడుదాం సార్ అని అనేవాడు’ అంటూ నిర్మాత రాజేష్ గురించి చెప్పుకొచ్చాడు.