K Ramp Movie Review: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే యూత్ లో మంచి ఆదరణ దక్కించుకున్న హీరోలలో ఒకరు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). డిఫరెంట్ స్టైల్ నటన,యాస, డైలాగ్ డెలివరీ ఉండడం తో ఒక సెక్షన్ యూత్ ఆడియన్స్ ఈయనకు బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని సినిమాలు కమర్షియల్ గా పెద్ద అయ్యాయి, కొన్ని సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. అలా వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు చేస్తున్న సమయం లో ఆయన నుండి విడుదలైన ‘క’ చిత్రం పెద్ద కమర్షియల్ హిట్ గా నిల్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, హీరో గా కిరణ్ అబ్బవరం ని మార్కెట్ లో స్థిరంగా నిలబెట్టింది. అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుండి వచ్చిన ‘దిల్ రూబ’ అనే చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన ‘K ర్యాంప్'(K Ramp Movie) చిత్రం ఈ నెల 18వ తారీఖున దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ మంచి ఫన్ గా అనిపించింది. కిరణ్ అబ్బవరం కచ్చితంగా ఈసారి సూపర్ హిట్ కొడుతాడు అనే నమ్మకాన్ని కలిగించింది ఈ చిత్రం. రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ఏర్పాటు చేశారట. మీడియా ప్రముఖులు మొత్తం ఈ ప్రివ్యూ షోని వీక్షించినట్టు సమాచారం. వాళ్ళ నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈమధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో మంచి ఫన్ ఉన్న సినిమాగా ఈ చిత్రం నిలిచిందని అంటున్నారు.
రెగ్యులర్ ఎంటర్టైనర్ లాగా కాకుండా, కాస్త డిఫరెంట్ యాంగిల్ లో ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించాడని, ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందని, సెకండ్ హాఫ్ ఆరంభం లో కాస్త బోర్ కొట్టినప్పటికీ, చివరి 30 నిమిషాలు మాత్రం చాలా బాగా తీసాడని, ఈ మాత్రం ఉంటే చాలు, కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం తో పాటు మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా వంటివి కూడా విడుదల అవుతున్నాయి. ఈ సినిమాల టాక్ ఆధారంగా ‘K ర్యాంప్’ మూవీ స్టేటస్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.