Big Boss 8 Telugu(1)
Big Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ప్రారంభంలోనే కంటెస్టెంట్స్ గెలుచుకునే ప్రైజ్ మనీ ని టాస్కులు ఆడుతూ మాత్రమే గెలుచుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న డబ్బులు ‘సున్నా’ అంటూ బిగ్ బాస్ ప్రకటిస్తాడు. కంటెస్టెంట్స్ అందరూ కలిసి ప్రైజ్ మనీ ని ఎంతవరకు తీసుకెళ్లారు అనేది ప్రతీ ఆదివారం నాగార్జున తెలుపుతాడు. ఇలా బిగ్ బాస్ సీజన్ 6 లో జరిగింది. షో ప్రారంభమైన 50 రోజుల తర్వాత నాగార్జున ఇలాంటి టాస్కుని కంటెస్టెంట్స్ కి ఇస్తాడు. కంటెస్టెంట్స్ కస్టపడి ఆడి ప్రైజ్ మనీ ని గెలుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సీజన్ లో ప్రారంభం నుండే ఆ పద్దతిని అమలు చేసారు. అంటే ప్రతీ వారం కంటెస్టెంట్స్ ఆడే ఆట తీరుని బట్టి ప్రైజ్ మనీ పెరుగుతూ పోతుంది అన్నమాట. అంటే గత సీజన్ లో లాగా 50 లక్షలు కాదు, అంతకు మించే ఉండొచ్చు అని నాగార్జున చెప్పుకొచ్చాడు.
అయితే ఈ వారం కంటెస్టెంట్స్ ఆట తీరు నాగార్జున కి బాగా నచ్చిందట, అందుకు ఆయన 5 లక్షల రూపాయిలు ప్రైజ్ మనీ లో జమ చేసాడు. కానీ బిగ్ బాస్ కి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, హౌస్ లో ఎలాంటి తప్పులు చేయకూడదు, చేస్తే కచ్చితంగా వచ్చే ప్రైజ్ మనీ లో తగ్గుతూ పోతుంది. ఈ మాట చెప్పిన తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ గత వారం లో చేసిన తప్పులను మొత్తం ఒక వీడియో గా చేసి చూపించాడు. ఆ వీడియో లో కంటెస్టెంట్స్ అందరూ అత్యధికంగా తెలుగుని కాకుండా ఇంగ్లీష్ ని ఎక్కువగా ఉపయాగించారు. దీనికి బిగ్ బాస్ హౌస్ నేను ఇచ్చిన 5 లక్షల రూపాయలలో ఎంత కట్ చేసి ఉంటాడో ఊహించి చెప్పండి అని నాగార్జున కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. ఒక్కో కంటెస్టెంట్ ఒక్క నెంబర్ చెప్తాడు. కానీ బిగ్ బాస్ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నాగార్జున ఇచ్చిన 5 లక్షల నుండి 2 లక్షలు కట్ చేసి కేవలం మూడు లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ కి జత చేసాడు.
అంటే దాదాపుగా 50 శాతం కోత విధించాడు అన్నమాట. మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ పొరపాటున కూడా ఇంగ్లీష్ పదం ఉపయోగించకుండా ఇక నుండైనా ఉంటారా?, లేదా ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ప్రైజ్ మనీ ని తగ్గించుకుంటూ పోతారా అనేది చూడాలి. ఇంగ్లీష్ బాషా మన రోజువారీ దినచర్యలలో ఒక భాగం అయిపోయింది, సహజం గానే ఎదో ఒక సందర్భంలో ఇంగ్లీష్ మాట్లాడేస్తూ ఉంటాము. అలా మాట్లాడడానికి ఇక నుండి కుదరదని నాగార్జున చెప్పాడు. పాటించడం చాలా కష్టమే, మగవాళ్ళు పాటించగలరేమో కానీ, ఆడవాళ్లు మాత్రం మాత్రం అసలు పాటించలేరు, కాబట్టి వచ్చే వారం కూడా నాగార్జున ప్రైజ్ మనీ ఇచ్చేటప్పడు కోతలు విధించి ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Big boss 8 telugu huge cut in prize money do you know how much big boss fined the contestants for speaking english in the house