Kingdom Beats HHVM: ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో ఒక సినిమా పై ఆడియన్స్ ఆసక్తి పెంచుకోవాలంటే వాళ్ళ అభిరుచి కి తగ్గట్టుగా ఉండాలంటే క్వాలిటీ ని మైంటైన్ చేయడం తప్పనిసరి. విడుదల చేసే ప్రమోషనల్ కంటెంట్ లో క్వాలిటీ కనిపించకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా ఆడియన్స్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసేస్తున్నారు. దానికి రీసెంట్ ఉదాహరణ ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి విడుదలయ్యే ఈ చిత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతుందని అంతా అనుకున్నారు. కానీ విడుదలకు ముందు ఈ చిత్రం నుండి వచ్చిన ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కనీసం అభిమానులను కూడా అలరించలేకపోయింది. ఫలితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటిసారి ఒక చిత్రం అంచనాలు లేకుండా విడుదలైంది.
Also Read: దుమ్ములేపేసిన ‘కింగ్డమ్’ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
ఫలితంగా మొదటి రోజే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా కేవలం 70 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ రావడం తో మొత్తానికే మోసం వచ్చింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కేవలం మూడు కోట్ల తో సరిపెట్టిందంటే ఎంత పెద్ద డిజాస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఓవర్సీస్ లో అయితే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకొని చెత్త సినిమా తీసినా ఇంత దరిద్రంగా వసూళ్లు రాదేమో. కేవలం 1 మిలియన్ డాలర్లు మాత్రమే ఇప్పటి వరకు ఈ చిత్రం రాబట్టింది. అభిమానులు కేవలం ప్రీమియర్ షోస్ నుండి రెండు మిలియన్ డాలర్ల గ్రాస్ ని రాబడుతుందని అనుకున్నారు. కానీ క్లోజింగ్ లో వచ్చింది.
Also Read: ఆ స్టార్ డైరెక్టర్ తో మహేష్ 30వ సినిమా.. ఇండస్ట్రీ షేక్…
ఇది ఎంత నీచమైన క్లోజింగ్ వసూళ్లు అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాము. మరో మూడు రోజుల్లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ‘కింగ్డమ్'(Kingdom Movie) విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో కొద్దిరోజుల క్రితమే మొదలు పెట్టారు. దీనికి అక్కడి ఆడియన్స్ నుండి కేవలం ప్రీమియర్ షోస్ కి 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి రెండు లక్షల 40 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్న గాక మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ సినిమాని తన సినిమాతో కేవలం ప్రీమియర్ షోస్ తోనే దాటేయడం అనేది పవన్ అభిమానులకు ఘోరమైన అవమానం వంటిది. పొరపాటున ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, ఫుల్ రన్ లో ‘హరి హర వీరమల్లు’ వరల్డ్ వైడ్ వసూళ్లను కూడా దాటే అవకాశం