Costumes Budget : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రాల్లో ఒకటి ‘కింగ్డమ్'(Kingdom Movie). చాలా కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఈ సినిమా తో భారీ కం బ్యాక్ ఇస్తాడని నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. కానీ సినిమాకు డీసెంట్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అవ్వడాన్ని చూస్తే విజయ్ దేవరకొండ బ్యాడ్ లక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కి మంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, సెకండ్ హాఫ్ కి షోస్ గడిచే కొద్దీ టాక్ మారిపోతూ వచ్చింది. దీంతో సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కానీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైనప్పుడు మాత్రం ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇది కాస్త విజయ్ దేవరకొండ పైకి ఊరట ని ఇచ్చే విషయం అనుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కోసం నిర్మాత సూర్య దేవర నాగవంశీ చాలా గట్టిగానే బడ్జెట్ ని ఖర్చు చేసాడు. కేవలం కాస్ట్యూమ్స్ కోసమే ఆయన కోటి రూపాయలకు పైగానే ఖర్చు అయ్యిందట. ఈ విషయాన్నీ నీరజ కోన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె దర్శకత్వం వహించిన ‘తెలుసు కదా’ చిత్రం ఈ దీపావళి కి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది. ఈమె శ్యామ్ సింగ రాయ్ తో పాటుగా, కింగ్డమ్ చిత్రానికి కూడా సహా నిర్మాతగా వ్యవహరించింది అట. శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి కేవలం కాస్ట్యూమ్స్ కోసం అయినా ఖర్చు 50 లక్షల వరకు ఉంటుందని, కింగ్డమ్ చిత్రానికి కోటి రూపాయలకు పైగానే ఉంటుందని చెప్పుకొచ్చింది. దీనిని బట్టీ సినిమాలకు బడ్జెట్ ఏ రేంజ్ లో ఖర్చు అవుతుందో ఒక అంచనా కి రావొచ్చు.
ఇంత ఖర్చు పెట్టి తీసే సినిమాలు ఇప్పుడు కనీసం మూడు రోజులకు మించి కూడా ఆడడం లేదంటే సినీ ఇండస్ట్రీ భారీ సంక్షోభం లో ఉన్నట్టే. ఈ ఏడాది అయితే ఇండస్ట్రీ కి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అయ్యింది. సెప్టెంబర్ నెలలో విడుదలైన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఓజీ, కాంతారా చిత్రాలు కూడా కమర్షియల్ గా దుమ్ము లేపేసాయి. చాలా కాలం తర్వాత థియేటర్స్ మళ్లీ ఆడియన్స్ తో కళకళలాడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాగే సూపర్ హిట్స్ వస్తే, బయ్యర్స్ చాలా వరకు మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒక సినిమా కాస్ట్యూమ్స్ కి ఎంత ఖర్చు అవుద్ది?#Kingdom కి spent more than a Crore on costumes..
Overall 80-90 Lakhs దాకా వెళ్ళిపోతుంది.. #TelusuKada https://t.co/JrgS67rFSQ pic.twitter.com/0jTJz9Bij0
— M9 NEWS (@M9News_) October 10, 2025