Kill Movie OTT: చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం అందుకుంది కిల్ మూవీ. 2023 జులై 5న కిల్ థియేటర్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. లక్ష్య లల్వాని హీరోగా నటించాడు. ఇక రాఘవ్ జుయల్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. లక్ష్యకు జంటగా తాన్యా మానిక్తాల నటించింది. కిల్ చిత్రానికి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించాడు. కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా, అచిన్ జైన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
సెప్టెంబర్ 7న కిల్ చిత్రాన్ని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. కాగా కిల్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుంది. కాగా సెప్టెంబర్ 6 నుండి ఓటీటీలో అందుబాటులోకి రానుందట. ఈ మేరకు సమాచారం అందుతుంది. యాక్షన్ మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. వన్ మ్యాన్ ఆర్మీగా లక్ష్య పాత్ర ఉంటుంది. ప్రేయసి కోసం ఒక బందిపోటు ముఠాను ఎలా ఎదుర్కొన్నాడు అనేది దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు.
కిల్ మూవీ కథ విషయానికి వస్తే… అమిత్ రాథోడ్(లక్ష్య) భారత సైన్యంలో ఎన్ఎన్జీ కమాండర్. తులిక(తాన్యా) అనే అమ్మాయితో చాలా కాలంగా ప్రేమలో ఉంటారు. తులిక-అమిత్ పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. అయితే తులిక ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు వేరే అబ్బాయితో పెళ్ళికి ఏర్పాట్లు చేస్తారు. మరో అబ్బాయితో తులికకు నిశ్చితార్థం కూడా జరుగుతుంది.
ఈ విషయం ప్రియుడు అమిత్ తో తులిక తెలియజేస్తుంది. ఆమెను దక్కించుకోవాలని అమిత్ ఢిల్లీకి ట్రైన్ లో బయలుదేరుతాడు. అదే ట్రైన్ లో తులిక తన పేరెంట్స్ తో పాటు ఢిల్లీకి వెళుతూ ఉంటుంది. ఈ ట్రైన్ ని దోచేయాలని ఫణి (రాఘవ్ జుయాల్) తన టీమ్ తో ఆ ట్రైన్లోకి ప్రవేశిస్తాడు. ఫణి నుండి తన ప్రేయసితో పాటు ఆమె కుటుంబానికి అపాయం ఎదురవుతుంది. మరి ఆ బందిపోటు వర్గాన్ని అమిత్ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేయసిని వారిని కాపాడుకున్నాడా? అనేది మిగతా కథ…