కియారాని అచ్చుగుద్దిన టిక్ టాక్ స్టార్

తెలుగు లో భరత్ అను నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. 2019 బ్లాక్ బస్టర్ హిట్ కబీర్ సింగ్ లో కియారా… ప్రీతి పాత్రను పోషించింది, ఇది అభిమానులకు ఎంతగానో నచ్చింది. కియారా అద్వానీ బాలీవుడ్‌లో విజయాన్ని ఆస్వాదిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమెను పోలినవారు కనిపిస్తున్నారు. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కల్పన శర్మ హీరోయిన్ కియారా మాదిరి మేకప్ తో అదరగొడుతోంది. దింతో కియారా అభిమానులు […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 6:02 pm
Follow us on

తెలుగు లో భరత్ అను నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీకి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. 2019 బ్లాక్ బస్టర్ హిట్ కబీర్ సింగ్ లో కియారా… ప్రీతి పాత్రను పోషించింది, ఇది అభిమానులకు ఎంతగానో నచ్చింది. కియారా అద్వానీ బాలీవుడ్‌లో విజయాన్ని ఆస్వాదిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమెను పోలినవారు కనిపిస్తున్నారు. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కల్పన శర్మ హీరోయిన్ కియారా మాదిరి మేకప్ తో అదరగొడుతోంది. దింతో కియారా అభిమానులు కల్పన అభిమానులుగా మారిపోయారు. కల్పన.. కియారా పోషించిన పాత్ర ప్రీతిని అనుకరిస్తుంటుంది. ఇంతే కాదు కల్పన అచ్చం కియారా లా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. తెల్లని కుర్తా ధరించి జుట్టును పోనీటైల్ లా కట్టి, కబీర్ సింగ్ చిత్రంలో ప్రీతి మాదిరిగా కనిపిస్తుంది. కాగా కియారా అద్వానీ నటించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం గిల్టీ మార్చి 6 న విడుదల కానుంది.