Kiara Advani Toxic Movie: ‘కన్నడ స్టార్ హీరో యాష్(Rocking Star Yash) నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్'(Toxic Movie) పై ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల, ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది/ రంజాన్ కానుకగా మార్చి 19 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ ఫైనల్ ఎడిటింగ్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో, ఈ చిత్రాన్ని జూన్ 4 కి వాయిదా వేశారు. కానీ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయడానికి కొంత సమయం అవసరమయ్యేలా ఉండడంతో ఈ చిత్రాన్ని జూన్ 4 నుండి కూడా వాయిదా వేశారు. ఇప్పుడు ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అనే దానిపై స్పష్టమైన క్లారిటీ లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, అందులో కియారా అద్వానీ కూడా ఒకరు. ఈమెతో ఈ చిత్రంలో యాష్ చాలా బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాడట. అది ఫైనల్ ఎడిటింగ్ లో చూసిన హీరోయిన్ కియారా అద్వానీ , బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు కొన్ని తొలగించాలంటూ హీరో యాష్ , డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ లను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు పెళ్లి అయ్యింది , ఒక బిడ్డ కూడా పుట్టాడు , ఇలాంటి సమయంలో ఆ స్థాయి బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు వెండితెర పై చూడడం కరెక్ట్ కాదు అనేది ఆమె ఉద్దేశ్యం. మరి కియారా అద్వానీ రిక్వెస్ట్ ని యాష్ , గీతూ మోహన్ దాస్ లు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి.
పెళ్లి అయ్యినప్పటికీ కూడా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించిన హీరోయిన్స్ ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. కియారా అద్వానీ కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడానికి సిద్దమే, కానీ హద్దులు దాటినా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వల్ల, సమస్యలు ఎదురు అవుతాయనే భయం ఆమెలో మొదలైంది , అప్పట్లో అంటే పెళ్లి కాలేదు కాబట్టి , ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఒప్పుకుంది , కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి , ఆమె మూవీ టీం ని ట్రిమ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసింది. ఇకపోతే ఈ చిత్రం లో కియారా అద్వానీ తో పాటు రుక్మిణి వాసంత్, నయనతార , తారా సుతారియా వంటి వారు కూడా నటించారు. నయనతార ఇందులో హీరో యాష్ కి అక్క పాత్రలో నటించిందని టాక్.