Khushi movie : మహేష్ బాబు థియేటర్ లో ‘ఒక్కడు’ మీద ‘ఖుషి’ కి ఎక్కువ వసూళ్లు..’ఖుషి’ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా లేదు

Khushi movie : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ‘ఒక్కడు’ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘ఖుషి’ చిత్రాలు ఎంత ప్రత్యేకమో మన అందరికీ తెలిసిందే.. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడమే కాకుండా, ఈ ఇద్దరి హీరోలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.. కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది ఈ రెండు చిత్రాలు..అలాంటి సినిమాలను ఇటీవలే రీ రిలీజ్ చేసారు. ఖుషి చిత్రం డిసెంబర్ […]

Written By: NARESH, Updated On : January 9, 2023 10:14 pm
Follow us on

Khushi movie : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ‘ఒక్కడు’ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘ఖుషి’ చిత్రాలు ఎంత ప్రత్యేకమో మన అందరికీ తెలిసిందే.. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడమే కాకుండా, ఈ ఇద్దరి హీరోలను మరో స్థాయికి తీసుకెళ్లాయి.. కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది ఈ రెండు చిత్రాలు..అలాంటి సినిమాలను ఇటీవలే రీ రిలీజ్ చేసారు.

ఖుషి చిత్రం డిసెంబర్ 31 వ తేదీన విడుదల అయితే, మహేష్ బాబు ‘ఒక్కడు’ చిత్రం జనవరి 7 వ తారీఖున విడుదలైంది..అయితే ఈ రెండు రీ రిలీజ్ లలో అభిమానులు మరియు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ చిత్రానికే బ్రహ్మరథం పడుతున్నారు..మొదటి రోజు ఏకంగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం , మొదటి వారం లో 7 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది.

ఖుషి రికార్డ్స్ ని కచ్చితంగా కొడుతోంది అనే అంచనాలతో దిగిన ‘ఒక్కడు’ మాత్రం ఖుషి కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది..ఖుషి మొదటి రోజు నైజం ప్రాంతం లో రాబట్టినంత వసూళ్లను కూడా ఒక్కడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా రాబట్టలేకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది..ఇక రెండవ రోజు వసూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..ఖుషి సినిమా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంటే.

ఒక్కడు చిత్రం మాత్రం మొదటి రోజే క్లోసింగ్ కి వచ్చేయడం అభిమానులు నిరాశకి గురి చేసింది..మరో విచిత్రం ఏమిటంటే మహేష్ బాబు సొంత థియేటర్ ‘AMB సినిమాస్’ లో కూడా ఒక్కడు చిత్రాన్ని డామినేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది ఖుషి చిత్రం..ఇప్పటికీ ఈ సినిమా ఆ థియేటర్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని రాబడుతుండగా..ఒక్కడు సినిమాకి మొదటి రోజే ఫుల్స్ పడలేదు..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.