Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ ‘ఖిలాడీ’. ఈ నెల 11న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 5.04 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ అంచనాలను పెంచగా.. రమేష్ వర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

‘ఖిలాడీ’లో యాక్షన్ కింగ్ అర్జున్ పాత్ర అదిరిపోతుందట. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో నటించాడు. రీసెంట్ గా ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఖిలాడీ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read: గంగలో అస్థికల నిమజ్జనం చేస్తే ఎక్కడికి చేరుతాయి.. శాస్త్రం నమ్మాలా.? సైన్స్ నా?
ఈ సినిమా ప్రమోషన్స్ తో రవితేజ బాగా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫుల్ కిక్కు అనే సాంగ్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు కూడా ఈ సాంగ్ ను ఫుల్ గా షేర్ అండ్ లైక్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ నిజంగానే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కు ఎక్కించింది. సినీప్రియులకు ఫుల్ కిక్ అందించింది.

యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా బలంగా ఉంటుందట. కాగా ఈ సినిమాలో నాజర్, పవిత్ర లోకేష్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలలో పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ యంగ్ హీరో కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు అని టాక్ ఉంది. మొత్తానికి ఈ సినిమా పట్ల రవితేజ అభిమానులు ఇంట్రెస్ట్ చూపించేలా చేసుకోవడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు అర్జున్ పోస్టర్ కూడా చాలా బాగుంది. సినిమా పై అంచనాలను పెంచింది.
[…] AP Government: పీఆర్సీ విషయమై ఏపీ సర్కారు, ఉద్యోగుల మధ్య ఫైట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రభుత్వం చర్చలతో సమ్మె నుంచి వెనక్కు తగ్గారు ఉద్యోగులు. చర్చలు సఫలమై ఉద్యోగులకు ఇచ్చే ఫిట్ మెంట్, ఇతర అంశాలపైన ఏపీ సర్కారు ప్రకటన చేసింది. ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లకముందే ఏపీ సర్కారు అప్రమత్తమై చర్చలకు చొరవ తీసుకుంది. కాగా, ఏపీ సర్కారు ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది. […]