Khaleja Re-Release : సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఆయన తన కెరీర్లో చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన ‘ఖలేజా’ (Khaleja) సినిమా అతనికి భారీ సక్సెస్ ని కట్టబెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా ఫ్లాప్ అయింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందించారు.అయినప్పటికి ఈ సినిమా సక్సెస్ అయితే సాధించలేదు. ఇక మే 30వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ అయితే ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ ని బుక్ మై షో లో పెట్టగా రికార్డు స్థాయిలో ఈ సినిమా టికెట్లు అమ్ముడుపోయాయి…
Also Read : భర్తకు భరణం ఇచ్చిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిస్తే మీరు కూడా ప్రశంసించకుండా ఉండలేరు..
రిలీజ్ అయినప్పుడు ప్లాప్ అయిన ఈ సినిమా రీ రిలీజ్ లో మాత్రం అద్భుతాన్ని సృష్టించబోతుంది అంటు ఇప్పటికే ట్రేడ్ పండితులు సైతం ఒక అంచనాకు వచ్చారు. ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయాలని మహేష్ బాబు అభిమానులతో పాటు మిగిలిన ప్రేక్షకులందరు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావడం లేదంటూ ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు.
కాబట్టి దానికి రివేంజ్ గా ఇప్పుడు ఈ సినిమాని సూపర్ సక్సెస్ ని చేసి చూపించాలనే దృక్పథంతో ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 30వ తేదీన ఈ సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులందరూ పోటీ పడుతూ ఉండడం విశేషం… ఈ సినిమా రిలీజ్ లో కనుక రికార్డులను క్రియేట్ చేస్తే అది ఒక పెను సంచలనంగా మారుతుంది.
రిలీజ్ అయినప్పుడు సక్సెస్ కాని సినిమాలు సైతం ఇప్పుడు రికార్డులను సృష్టించి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసింది అంటూ ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి త్రివిక్రమ్ మాటల పదును మహేష్ బాబు డైలాగ్ డెలివరీ మొత్తం కలిపి ఈ సినిమాని రిలీజ్ లో సూపర్ సక్సెస్ చేయబోతున్నట్లుగా తెలుస్తున్నాయి… మరి ఈ సినిమా రీ రిలీజ్ లో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…