https://oktelugu.com/

‘KGF 2’ Full Review : ‘కేజీఎఫ్ 2’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

‘KGF 2’ Full Review : షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ఈ క్రమంలో `కేజీఎఫ్ 2′ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్‌ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది. గతంలో అతను […]

Written By:
  • Shiva
  • , Updated On : April 12, 2022 / 10:09 AM IST
    Follow us on

    ‘KGF 2’ Full Review : షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ఈ క్రమంలో `కేజీఎఫ్ 2′ సినిమాను ఆల్ రెడీ చూసిన ఓవర్‌సీస్‌ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్‌ సంధు.. ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు. ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది.

    ‘KGF 2’ Full Review

    గతంలో అతను ముందుగానే ‘దంగల్, బాహుబలి 2’, ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల విషయంలో ఇలాగే రివ్యూ ఇచ్చారు. అవి నిజం అయ్యాయి కూడా. కాబట్టి `కేజీఎఫ్ 2′ విషయంలో కూడా నిజం అవుతుందని నమ్మకం ఉంది. ఇంతకీ ఉమైర్ సంధు `కేజీఎఫ్ 2′ రివ్యూలో ఏమి చెప్పాడంటే..

    Also Read: Ghani Movie 3 Days Collections: 25 కోట్లు పెట్టి తీశారు.. మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?

    “కేజీఎఫ్ 2’లో మెయిన్ హైలైట్స్ ఇవే !

    “కేజీఎఫ్ 2’లో ఉత్కంఠ రేపే సన్నివేశాలతో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, మరియు యాక్షన్స్ సీన్స్.. అలాగే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సూపర్ గా ఉన్నాయి. ఇక డైలాగ్స్, మ్యూజిక్.. బీజీఎం అదిరిపోయింది. యష్ టెరిఫిక్‌గా నటిస్తే.. సంజయ్ దత్ నటన అవుట్ స్టాడింగ్ గా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్బుతంగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించాడు’ అంటూ ఉమైర్ సంధు ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

    అలాగే సినిమా మొదలైనప్పటి నుంచి ప్రతి సీన్ అదిరిపోయింది. సినిమా చూస్తున్నంతసేపు చూపు తిప్పుకోలేము. అందుకే, కేజీఎఫ్‌ 2 కేవలం శాండల్‌ వుడ్‌ బాక్ల్‌బస్టర్‌ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్‌ క్లాస్‌ యాక్షన్ మూవీ. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌ అయితే అందరికి షాకిస్తుంది’ అంటూ ఉమైర్‌ సంధు చెప్పుకొచ్చాడు.

    ‘KGF 2’ Full Review

    అలాగే హీరో యశ్‌ తో పాటు శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, మాళవిక అవినాష్ కూడా అదరగొట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని వేరే క్రిటిక్స్ కూడా చెప్పారు.

    మరి, ఈ రివ్యూ నిజం ఐతే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టడం ఖాయం. పైగా ‘కేజీఎఫ్‌ 2’ విడుదల కోసం సీనీ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు ఖాయం.

    తీర్పు :

    మొత్తమ్మీద ఈ చిత్రం అద్భుతమైన ఓ విజువల్ యాక్షన్ డ్రామా.. భారీ యాక్షన్ తో సాగే ఎమోషనల్ క్లాసిక్ డ్రామా. సింగిల్ మాటలో ఇదొక ఓ యాక్షన్ ఫీస్ట్. చివరగా ఈ సినిమా అబ్బుర పరుస్తోంది.

    Also Read:KGF2 : బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!

    Tags