Allu Arjun Pushpa 2: కెజిఎఫ్ చిత్రానికి పుష్ప చిత్రానికి చాలా పోలికలు ఉన్నాయి. కెజిఎఫ్ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో, పుష్ప ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందాయి. రాకీ భాయ్, పుష్ప రాజ్ ఎమోషన్, లక్ష్యం దగ్గరగా ఉంటాయి. వీరిద్దరూ చిన్నప్పటి నుండి అణచివేతకు గురవుతారు. వేధింపులు, అవమానాల కారణంగా ఏదైనా కానీ గొప్ప మాఫియా సామ్రాజ్యం సృష్టించాలని అనుకుంటారు. దర్శకుడు సుకుమార్ కెజిఎఫ్ స్ఫూర్తితోనే ఈ కథ రాసుకున్నాడా? అనే అనుమానం మనకు కలుగుతుంది.
ఈ క్రమంలో పుష్ప 2 కథేంటి అనే ఆసక్తి మొదలైంది. అయితే పుష్ప 2 విషయంలో కూడా సుకుమార్ కెజిఎఫ్2 ని ఫాలో అయ్యాడని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2లో రష్మిక మందాన పాత్ర చనిపోతుంది. తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించిన పుష్ప అతిపెద్ద డాన్ గా ఎదుగుతాడట. అడవుల్లో పెద్ద పెద్ద గోడౌన్స్ నిర్మించి భారీ ఎత్తున ఎర్ర చందనం బిజినెస్ చేస్తూ ఉంటాడట. ఈ క్రమంలో పుష్పను పట్టుకోవడానికి ఆఫీసర్ షెకావత్ రష్మికను వాడుకుంటాడట. చివరికి రష్మిక చనిపోతుందట. భార్య మరణం అతిపెద్ద ఎమోషన్ గా పుష్ప పోలీసులపై తిరగబడతాడట.
Also Read: Thalapathy 66: విజయ్ ఫ్యాన్స్ కి భారీ సర్పైజ్… తలపతి 66 నుండి ఫస్ట్ లుక్!
పుష్ప పార్ట్ 2లో రష్మిక పాత్ర కూడా తగ్గించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో దాదాపు కెజిఎఫ్ 2ని పోలి ఉంటుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇదే నిజమైతే యాజిటీజ్ గా కెజిఎఫ్ 2ని సుకుమార్ దించేసినట్లు అవుతుంది. దాని వలన మూవీ ఫలితం దెబ్బ తినే అవకాశం కలదు. మరి సుకుమార్ కెజిఎఫ్ ఛాయలు కనిపించకుండా ఎంత మేరకు జాగ్రత్త పడతాడో చూడాలి. సౌత్ ఇండియా నుండి తెరకెక్కిన అన్ని పాన్ ఇండియా చిత్రాల సీక్వెల్స్ భారీ హిట్ కొట్టాయి. బాహుబలి, కెజిఎఫ్ సీక్వెల్స్ పది రెట్లు అధిక వసూళ్లు సాధించాయి. ఆ సెంటిమెంట్ కొనసాగితే అల్లు అర్జున్ కి ఓ భారీ పాన్ ఇండియా హిట్ దక్కనుంది.
ఇక ఫస్ట్ పార్ట్ సక్సెస్ నేపథ్యంలో గ్రాండ్ గా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ సైతం రెట్టింపు చేశారు. మరింత హంగులతో తెరకెక్కించాలన్న కారణంగా పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లడం ఆలస్యం అవుతుంది. పుష్ప సీక్వెల్ పై దేశవ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది.
Also Read:Prakash Raj About Sai Pallavi: దుమ్మురేపుతున్న సాయిపల్లవి వ్యాఖ్యలు.. ఆమెకు మద్దతుగా ప్రకాశ్ రాజ్