KGF 2 Dialogue On Wedding Card: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన `కేజీఎఫ్’ సిరీస్ లో డైలాగ్స్ వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి కూడా. ఐతే, ఈ సినిమాలో యష్ చెప్పిన ఒక డైలాగ్ మాత్రం ఇప్పుడు చాలా ఫేమస్ అవడమే కాక ఏకంగా ఒక శుభలేఖలో కూడా అచ్చయింది.

దీనిబట్టి, ఈ సినిమా క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏమిటా డైలాగో చూద్దాం. ఈ సినిమా ట్రైలర్ లో ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ‘వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఇది. ‘వైలెన్స్… వైలెన్స్…వైలెన్స్, ఐ డోంట్ లైక్! ఐ అవాయిడ్! బట్, వయలెన్స్ లైక్స్ మీ. సో ఐ కాంట్ అవాయిడ్!’ అంటూ యష్ పవర్ ఫుల్ గా ఈ డైలాగ్ చెప్పాడు.
Also Read: Vijay Devarakonda- Samantha: ఈ రోజు పూజ.. ఎల్లుండు ‘సమంత’తో రొమాన్స్ !
అయితే, ఇదే డైలాగ్ ను కర్ణాటకలోని బెల్గావికి చెందిన చంద్రశేఖర్ అనే ‘యష్’ ఫ్యాన్.. తన పెళ్లి పత్రికలో ఈ డైలాగ్ ను ఈ విధంగా వేసుకున్నాడు. ‘మ్యారేజ్… మ్యారేజ్… మ్యారేజ్… ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్. బట్, మై రిలేటివ్స్ లైక్ మ్యారేజ్. ఐ కాంట్ అవాయిడ్’ అంటూ వేశాడు.
అంటే.. ‘పెళ్లి… పెళ్లి… పెళ్లి… నాకు ఇష్టం లేదు. దాన్ని దూరం పెడుతున్నాను. కానీ, మా బంధువులకు నా పెళ్లి అంటే ఇష్టం. అందుకే తప్పించుకోలేను’ అంటూ అతగాడు రాసుకొచ్చాడు. మొత్తానికి ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా వచ్చిన`కేజీఎఫ్ 2` బాక్సాఫీస్ పై ఇంకా దాడి చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మొత్తానికి కేజీఎఫ్ 2`కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
Also Read: Star Directors: ఒక్క ఛాన్స్ తో వందల కోట్లు కొల్లగొట్టింది వీళ్ళే !
Recommended Videos:
[…] Also Read: KGF 2 Dialogue On Wedding Card: శుభలేఖ పై కూడా ‘కేజిఎఫ్ 2’… […]
[…] Also Read: KGF 2 Dialogue On Wedding Card: శుభలేఖ పై కూడా ‘కేజిఎఫ్ 2’… […]
[…] Also Read: KGF 2 Dialogue On Wedding Card: శుభలేఖ పై కూడా ‘కేజిఎఫ్ 2’… […]