Ketika Sharma: కొత్త తరం భామల హడావుడి ఎక్కువ అయిందనుకునే సమయంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ‘కేతిక శర్మ’. ఈ బ్యూటీ మొదట్లో చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది అనిపించింది. ఎలాగూ ఏవరేజ్ హీరోలకు హీరోయిన్ల సమస్య ఉంది. అందుకే, చాలామంది మేకర్స్ తమ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కేతిక శర్మనే మంచి ఆప్షన్ అనుకున్నారు.

దానికి తగ్గట్టుగానే కేతిక శర్మ కూడా తన మొదటి సినిమా ‘రొమాంటిక్’లో తనకున్న అందాలన్నీ అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా ఆరబోసింది. అంత ఆరబోసినా ఆ సినిమాలో అమ్మడికి పాస్ మార్కులే దక్కాయి. అమ్మడు సోకుల ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతాయి అనుకుంటే.. సినిమాలో ఎక్కడో తేడా కొట్టింది. కేతికలో అందాలు ఉన్నాయి గానీ, అభినయం లేదు అని విమర్శకులు తేల్చేశారు.
దాంతో పాపం కేతిక ఫేట్ మారింది. నిజానికి రొమాంటిక్ సినిమా పోస్టర్స్, టీజర్స్ చూసిన వారంతా ఈ భామకు సినిమా రిలీజ్ తర్వాత అవకాశాలు వెల్లువలా వస్తాయని అంతా అన్నారు. నమ్మారు. కానీ సినిమా రిలీజ్ అయి, ప్లాప్ అయ్యాక అవకాశాలు మాత్రం రావడం లేదు. కనీసం చిన్నాచితకా హీరోల సినిమాల్లో కూడా కేతికకు అవకాశం రాకపోవడంతో అమ్మడు తెగ ఇదైపోతుంది.
ఇప్పటికే హైదరాబాద్ లో మకాం పెట్టింది. మరోపక్క కేతిక రెండో సినిమా ‘నాగశౌర్య’ హీరోగా వస్తోన్న ‘లక్ష్య’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. లక్ష్య సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కేతిక యాక్టివ్ కానుంది. కనీసం ఈ సినిమానైనా ఆడితే తన క్రేజ్ పెరుగుతుందేమో అని కేతిక ఆశ పడుతుంది.
Also Read: Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు… అసలేం జరిగిందంటే ?
కానీ, కేతిక శర్మకు మాత్రం మొదటి నుంచి కాలం కలిసి రాలేదు. బ్యాడ్ టైమ్ లోనే అమ్మడు టైం అంతా గడిచిపోతుంది. ఎంత అందం ఉన్నా, ఎంతగా గ్లామర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కేతిక శర్మకు సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదో ? గ్లామర్ విషయంలో నూటికి నూట యాభై మార్కులు సాధించింది. తన హస్కీ హావభావాలతోనే యూత్ గుండెల్లో మంటలు పెట్టింది. ఇప్పటికైనా కేతికకు అవకాశాలు పెరగాలని ఆశిద్దాం.
Also Read: Mahesh Allu Arjun Balakrishna: ఓకే రూట్ లో మహేష్, అల్లు అర్జున్, బాలయ్య