Keerthy Suresh: సౌత్ ఇండియా లో అందం తో పాటు అద్భుతమైన అభినయం ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ పేరు మొదటి వరుస లో ఉంటుంది. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ సమయం లోనే నటన లో తన విశ్వరూపం చూపించి నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకున్న మహానటి ఆమె. ఇండస్ట్రీ లో అందరూ ఆమెని మహానటి అని పిలుస్తుంటారు, ఆడియన్స్ లో తన నటనతో ఆమె వేసిన ముద్ర అలాంటిది.
ఒక పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోపక్క స్టార్ హీరోల సరసన నటిస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఈ మహానటి. రీసెంట్ గా ఈమె హీరోయిన్ గా నటించిన ‘దసరా’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో హీరోగా నటించిన నాని కి ఎంత మంచి పేరు వచ్చిందో, హీరోయిన్ గా చేసిన కీర్తి సురేష్ కి కూడా అంతే గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.
అయితే కీర్తి సురేష్ కి సౌత్ లో ఎంత మంచి డిమాండ్ ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయిల పారితోషికాలు ఇచ్చిన తానూ నియమించుకున్న కొన్ని నిబంధలను మాత్రం తూచా తప్పకుండ ఫాలో అవుతుందట. సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో ఈమె నటించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకుందట. తన తల్లి తండ్రులకు కూడా ఈ విషయం చెప్పే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిందట. నా మొదటి లిప్ లాక్ కేవలం నా భర్త తో మాత్రమే అని, సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలకు తావు లేదని చెప్పుకొచ్చింది.
ఆమె తీసుకున్న ఈ నిర్ణయం పై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతం లో ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా కూడా ఇలాగే చెప్పింది. కానీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఇప్పుడు ఆమె ఏకంగా బెడ్ రూమ్ అడల్ట్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటిస్తుంది, కీర్తి సురేష్ కూడా అలాంటి ట్విస్ట్ ఇవ్వకుంటే చాలు అని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్.