
‘మహానటి’ సినిమాతో హోమ్లీ హీరోయిన్ ‘కీర్తి సురేష్’ ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయిందనేది వాస్తవం. ఓ దశలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా కూడా నిలిచింది కీర్తి. ఐతే, సినిమాలు అయితే వరుసగా వచ్చాయి గానీ, కీర్తికి మాత్రం సోలోగా ఒక్క హిట్ కూడా రాలేదు. అయితే ముద్దుగా, కాస్తా బొద్దుగా ఉండే కీర్తి ఈ మధ్య డైట్ చేసి మొత్తానికి బాగా సన్నబడింది.
ఆమె లాస్ట్ సినిమా ‘రంగేదే’ సినిమాలోనే కీర్తి లావు తగ్గినట్టు కనిపించే సరికి ఆమె అభిమానులకు ఆ లుక్ అసలు రుచించలేదు. ‘కీర్తి సురేష్ కి ఏమైంది ? ఎందుకు బాగా సన్నబడిపోతుంది ? మీరు సన్నగా ఉంటే అసలు బాగాలేదు, మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు’ అంటూ ఆ మధ్య అభిమానులు కామెంట్స్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్త పరిచారు. సో.. తన డైట్ అభిమానులకు నచ్చలేదు కాబట్టి, ఇక కీర్తి మళ్ళీ సన్నబడటానికి ట్రై చేయదు అనుకున్నారు ఆమె ఫాలోవర్స్.
కానీ తన లేటెస్ట్ లుక్ తో అందరికీ మళ్ళీ షాక్ ఇచ్చింది కీర్తి. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో కీర్తి సురేష్ లుక్ ను చూసిన ఆమె అభిమానులు మరోసారి తీవ్ర నిరాశకి గురి అయ్యారు. కీర్తి వీడియో పోస్ట్ చేస్తూ ‘నిశ్శబ్దం, యోగా నా డైలీ వర్కౌట్స్ లో భాగమైయాయి’ అంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. అయితే, ఈ వీడియోలో బాగా సన్నగా కనిపిస్తోన్న కీర్తిని చూడలేక, ఆమె అభిమానులు సీరియస్ అవుతున్నారు.
‘అయ్యో కీర్తి.. మీకు ఏమైంది. ఎందుకు మరీ ఇంతగా సన్నబడ్డారు, ఇంతగా లుక్ మార్చడం దేనికి ? మీకు అంత అవసరం ఏమొచ్చింది, మీరు బొద్దుగా ఉంటేనే బాగుంటారు’ అంటు నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే కీర్తి తన లుక్ ను మార్చడానికి ప్రధాన కారణం మహేశ్ బాబు అట. మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్లు లుక్ మార్చుకునే అలవాటు ఉన్న కీర్తి, సర్కారు కోసం కొత్త లుక్ ట్రై చేస్తోంది.
View this post on Instagram