ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పట్లో లేదట !

మ‌హాన‌టి ఫేమ్ ‘కీర్తి సురేష్’ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమాలు ఎక్కువైపోయాయి. వరుసగా ఆమె తానే మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తోంది. లాక్ డౌన్ లోనే ‘పెంగ్విన్’ అంటూ సోలో లీడ్ తో సినిమాని చేసి రిలీజ్ చేసింది. ప్రస్తుతం సఖితో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ మధ్య కీర్తి సురేష్ పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. […]

Written By: admin, Updated On : March 1, 2021 6:27 pm
Follow us on


మ‌హాన‌టి ఫేమ్ ‘కీర్తి సురేష్’ ప్రధాన పాత్రలో వస్తోన్న సినిమాలు ఎక్కువైపోయాయి. వరుసగా ఆమె తానే మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తోంది. లాక్ డౌన్ లోనే ‘పెంగ్విన్’ అంటూ సోలో లీడ్ తో సినిమాని చేసి రిలీజ్ చేసింది. ప్రస్తుతం సఖితో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ మధ్య కీర్తి సురేష్ పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి.

ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటూ రకరకాల ప్రచారం జోరుగా సాగుతోంది. మొదట్లో ఒక బీజేపీ నాయకుడితో ఆమె పెళ్లి అని మొదట రూమర్ రావడం, ఆ తరువాత అది కేవలం రూమరే అని క్లారిటీ రావడం జరిగింది. కానీ ఈ మధ్య సంగీత దర్శకుడు అనిరుధ్ తో కీర్తి పెళ్లి ఫిక్స్ అంటూ కాస్త గట్టిగా వినిపించింది. దీనికితోడు, కీర్తి కూడా ఆ వార్తల పై పెదవి విప్ప లేదు. మరోపక్క అనిరుధ్ తో ఆమె ట్రిప్స్ కూడా వేస్తోందని మళ్ళీ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

దాంతో వీరిద్దరి మధ్య నిజంగానే ఏదో ఉందనే భావన కలుగుతుంది. కాకపోతే మరోపక్క అస్సలు తనకు పెళ్లి ఆలోచనే లేదు అన్నట్టు.. ఇప్పుడు సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటోంది కీర్తి. ఆమె నటించిన రంగ్ దే’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. మరోవైపు, మహేష్ బాబు సినిమాతో పాటు రజినీకాంత్ చిత్రం ‘అన్నత్తే’లో కూడా కీర్తి నటిస్తోంది. ఐతే ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలుకాలేదు కాబట్టి ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో ఉండదు.

అలాగే విజయ్ కొత్త సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరి పెళ్లి ఆలోచన ఉంటే కొత్తగా సినిమాలు ఒప్పుకునేది కాదు కదా అంటున్నారు ఆమె సన్నిహితులు. దీనిబట్టి కీర్తి ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోదు అని క్లారిటీ వస్తోంది.