https://oktelugu.com/

Keerthy Suresh : ఇంత బతుకు బతికి కమెడియన్ తో రొమాన్స్ చేయబోతున్న కీర్తి సురేష్.. పాపం ఆమె రేంజ్ ఇలా పడిపోయిందేంటి!

పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, చిరంజీవి మరియు రజినీకాంత్ వంటి స్టార్స్ సరసన నటించిన కీర్తి సురేష్ ని, ఇప్పుడు ఒక మామూలు కమెడియన్ సరసన నటిస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని కీర్తి సురేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

Written By: , Updated On : June 15, 2023 / 10:36 PM IST
Follow us on

Keerthy Suresh : ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ‘మహానటి’ సినిమాలో అద్భుతంగా నటించి నేషనల్ అవార్డుని గెలుచుకున్న నటి కీర్తి సురేష్. ఈమెకి ప్రస్తుతం సౌత్ లో ఒక స్టార్ హీరో కి ఉన్నంత స్టార్ స్టేటస్ ఉంది. ఈమెని ప్రధాన పాత్ర లో పెట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే జనాలు కచ్చితంగా క్యూ కట్టేస్తారు అనే నమ్మకం నిర్మాతలలో ఉంది. అయితే ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తి సురేష్ చేసిన రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు డైరెక్టుగా ఓటీటీ లోనే విడుదల అయ్యాయి.

వాటికి నెగటివ్ టాక్ రావడం తో మిశ్రమ స్పందన లభించింది. ఇక గత ఏడాది ఈమె చేసిన మరో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ అనే చిత్రం అలా థియేటర్స్ లోకి వచ్చి ఇలా వెళ్ళిపోయింది, అంత పెద్ద ఫ్లాప్ అవ్వడం తో కీర్తి సురేష్ కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ‘సర్కారు వారి పాట’.. ‘దసరా’ చిత్రాల్లో హీరోయిన్ గా చేసి పెద్ద హిట్స్ ని అందుకుంది.

దీంతో ఆమె మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం తో ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధం అవుతుంది. ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’,  ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలలో హీరో గా నటించిన సుహాస్ ఒక ముఖ్య పాత్ర పాశురంచబోతున్నాడట. ఇందులో ఆయన కీర్తి సురేష్ కి జోడిగా నటించబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, చిరంజీవి మరియు రజినీకాంత్ వంటి స్టార్స్ సరసన నటించిన కీర్తి సురేష్ ని, ఇప్పుడు ఒక మామూలు కమెడియన్ సరసన నటిస్తే ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అని కీర్తి సురేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

అయితే గతం లో కూడా ఇలాగే ప్రముఖ హీరోయిన్ ‘ఆర్తి అగర్వాల్’ కమెడియన్ సునీల్ తో ‘అందాల రాముడు’ అనే చిత్రం చేసింది. విడుదలకు ముందు అంత పెద్ద హీరోయిన్ ఇప్పుడు కమెడియన్ తో సినిమా చెయ్యడం ఏమిటి అని అనుకున్నారు, కానీ విడుదల తర్వాత ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అలాగే అవుతుందో లేదో చూడాలి.
Recommended Video:
‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ | Adipurush Movie Review | Public Talk | Oktelugu Entertainment