Bigg Boss Final Keerthi : ఎన్నో భారీ అంచనాల నడుమ అట్టహాసం గా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 నేటితో ముగిసింది..సూపర్ హిట్ సీజన్ అనలేము..అలా అని అట్టర్ ఫ్లాప్ సీజన్ అని కూడా అనలేము..యావరేజి సీజన్ గా చెప్పుకోవచ్చు..రేటింగ్స్ కూడా అలాగే వచ్చాయి..ప్రారంభం నుండి కంటెస్టెంట్స్ చురుగ్గా టాస్కులు ఆడి ఉంటే ఈ సీజన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది..కానీ నాల్గవ వారం వరుకు కంటెస్టెంట్స్ లో ఆడాలనే కసి రాకపోవడం ఈ సీజన్ కి బాగా దెబ్బ పడింది.

మొత్తానికి సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది..రేవంత్ ట్రోఫీ గెలుచుకోగా, శ్రీహాన్ క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు..ఇక ఈ సీజన్ లో టాప్ 3 స్థానం లో నిలిచినా కంటెస్టెంట్ గా కీర్తి నిలిచింది..ప్రారంభం నుండే ఆమె ఆటలో తన మార్కుని చూపిస్తూ వచ్చింది..అంతే కాకుండా తన బ్యాక్ గ్రౌండ్ మరియు ఆమె జీవితం లో చోటు చేసుకున్న విషాద సంఘటనలు విని ప్రేక్షకులలో కీర్తి పై బాగా సానుభూతి కలిగింది.
తన బ్యాక్ గ్రౌండ్ తో పాటు ఆమె ఆటతీరుని కూడా ప్రేక్షకులు బాగా నచ్చారు..చేతివేళ్ళు విరిగిపోయిన కూడా ఆమె ఆడిన ఆట అందరికీ తెగ నచ్చేసింది..అందుకే ఆమె ఇంత దూరం రాగలిగింది..కానీ తాను పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదని ఆమె అభిమానులందరూ ఫీల్ అవుతున్నారు..టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యే ముందు బిగ్ బాస్ ఇచ్చిన 30 లక్షల ఆఫర్ ని కీర్తి ఒప్పుకొని తీసుకొని ఉంటే చాలా బాగుండేది అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
అయితే 15 వారాలకు గాను ఆమె బిగ్ బాస్ హౌస్ లో కొనసాగినందుకు గాను ఆమెకి 8 లక్షల రూపాయిల పారితోషికం వచ్చినట్టు తెలుస్తుంది..టైటిల్ గెలుస్తుందనే నమ్మకం తోనే ఆమె ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది..అప్పటికి తన సన్నిహితులు ఆమెకి హింట్స్ ఇచ్చినా కూడా ఆ ఆఫర్ ని అందుకోలేకపోవడం గమనార్హం..కానీ బిగ్ బాస్ ఆమెకి సరికొత్త జీవితం ఇచ్చిందనే చెప్పాలి..ఆమె భవిష్యత్తు ఇక్కడి నుండి ఎలా ఉండబోతుందో చూడాలి.