Keerthi Suresh: కీర్తి సురేశ్ “గుడ్ లక్ సఖి” సినిమా విడుదల తేదీ ఖరారు…

Keerthi Suresh: కీర్తి సురేశ్… నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో కీర్తికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత  తెలుగు, తమిళ, భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. అయితే సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ […]

Written By: Raghava Rao Gara, Updated On : November 2, 2021 10:31 am
Follow us on

Keerthi Suresh: కీర్తి సురేశ్… నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో కీర్తికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత  తెలుగు, తమిళ, భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. అయితే సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి… ఇలా వ‌రుస‌గా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఇవి క‌రోనా టైంలోనే పూర్తయి… విడుద‌ల‌ సిద్ధ‌మ‌య్యాయి. ఐతే పెంగ్విన్, మిస్ ఇండియా గ‌త ఏడాదే ఓటీటీ ద్వారా రిలీజై కీర్తి అభిమానుల‌కు తీవ్ర నిరాశ మిగిల్చాయని చెప్పాలి.

సినిమా పూర్తి అయిన కానీ గుడ్ ల‌క్ స‌ఖి సినిమా గురించి ఇటీవల కాలంలో ఏ అప్డేట్ రాలేదు. ఇటీవ‌ల కీర్తి పుట్టిన రోజు సంద‌ర్భంగా కమింగ్ సూన్ అని పోస్ట‌ర్ ను మూవీ యూనిట్  రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ చిత్రానికి విడుద‌ల తేదీ కూడా ఖరారైంది. న‌వంబ‌రు 26న గుడ్ ల‌క్ స‌ఖి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మ‌ధ్య‌లో బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు టేక‌ప్ చేయ‌డం విశేషం. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రంలో కీర్తి.. గిరిజ‌న తెగ‌కు చెందిన‌ ఆర్చ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ గుడ్ ల‌క్ స‌ఖికి సంగీతాన్నందించాడు.

డిసెంబ‌రులో వివిధ భాష‌ల్లో పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా… న‌వంబ‌రులో చాలా వ‌ర‌కు చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలే రిలీజ‌వుతున్నాయి. ఈ వ‌రుస‌లో గుడ్ ల‌క్ స‌ఖి రిలీజ్ కి కూడా సన్నాహాలు చేశారు.